English   

తూఛ్.. ఎన్టీఆర్ మేటర్ అంతా ఉత్తిదే

NTR-Aravinda-Sametha
2018-08-27 00:53:27

సోషల్ మీడియా పెరిగాక చాలామందిలో అత్యుత్సాహం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇదుగో పోస్టర్ అంటే అదుగో ట్రైలర్ అంటున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించి వ్యాపిస్తోన్న గాసిప్పులకు లెక్కేలేదు. అఫ్ కోర్స్ ఈ గాసిప్ప్ ను ఎంజాయ్ చేసేవారూ ఉంటున్నారనుకోండి. నిజం అయితే సంతోషం.. లేదంటే లైట్ తీసుకునే అంటున్నారన్నమాట. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ విషయంలోనూ ఇలాంటి రూమర్స్ గత మూణ్నాలుగు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఇవి ఏకంగా యూనిట్ వరకూ వెళ్లినట్టున్నాయి. అందుకే అలాంటిదేం లేదని ఖండించారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. అరవింద సమేత వీరరాఘవకు సంబంధించి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ టీజర్ విడుదల చేశారు. ఊరమాస్ గా ఉన్న ఆ టీజర్ మాస్ ను మాత్రం ఆకట్టుకుంది. కానీ క్లాస్ పెదవి విరిచారు. ఏముందీ ఇందులో అన్నారు. దీన్ని ఆసరగా చేసుకుని కొందరు రూమర్ రాయుళ్లు రెచ్చిపోయారు. త్వరలోనే అరవింద సమేత వీరరాఘవ నుంచి మరో టీజర్ వస్తుందని ప్రచారం మొదలైంది. అయితే ఈ సారి టీజర్ త్రివిక్రమ్ శైలిలో క్లాస్ గా ఉంటుందని చెప్పారు. అంతేనా.. ఈ వినాయక చవితికి ఆ టీజర్ వస్తుందని కూడా చెప్పారు. దీంతో ఇది నిజమే అనుకుని చాలామంది ఎన్టీఆర్్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. బట్ ఆ న్యూస్ పూర్తిగా ఫేక్.

ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్నే చెబుతూ ట్వీట్ చేశాడు. అరవింద సమేత నుంచి రెండో టీజర్ వంటివేవీ ఉండవు. డైరెక్ట్ గా థియేట్రికల్ ట్రైలరే ఉంటుంది. అయితే ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా డిసైడ్ చేయలేదు. కాబట్టి సెకండ్ టీజర్ పై వస్తున్న వార్తలు ఎవరూ నమ్మొద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఇకనైనా ఈ సెకండ్ టీజర్ కామెడీలు ఆగితే మంచిది. 

More Related Stories