English   

సిల్లీ ఫెలోస్ ట్రైలర్.. ఫన్నీ ఫెలోస్ .. 

silly-fellows-trailer
2018-08-27 08:25:53

అల్లరి నరేష్ హీరోగా సునిల్ ‘కమెడియన్’గా వస్తోన్న సినిమా సిల్లీ ఫెలోస్. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్టుగానే చాలా ఫన్నీగానే ఉందీ ట్రైలర్. కాకపోతే కొత్తదనం మాత్రం కనిపించడం లేదు. కొత్తదనం లేకపోయినా చూస్తున్నంత సేపూ నవ్వించగలిగితే చాలు. ఈ సిల్లీఫెలోస్ పాసైపోతారు. ‘గుండె రాయి చేసుకోండి కిడ్నీలు ఇడ్లీలు చేసుకోండి’ వంటి ఫన్నీ డైలాగ్స్ నరేష్ స్టైల్ లో భలే అనిపించాయి. ఇక ఈ ట్రైలర్ తో పూర్తిగా తేలిపోయిన విషయం ఏంటంటే.. సునిల్ పూర్తి స్థాయిలో కమెడియన్ గా మారిపోయాడు. తనలో తను నిన్నటి వరకూ హీరో అన్నఫీచర్స్ ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకూ ఈ సినిమాకు టైటిల్ మైనస్ అవుతుందనుకున్నారు. కానీ ట్రైలర్ చూశాక అదే కరెక్టేమో అనిపిస్తోంది. ఏ పని లేకుండా పెద్ద కలలు కంటూ ఆవారాగా తిరిగే బ్యాచ్ లా ఈ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరికి ఓ ఐదువందల కోట్ల స్కామ్ తో సంబంధం.. వెరసి దీని చుట్టూ తిరిగే కథ.. ఫన్నీగా సాగడం.. 

ఇక నరేష్ సరసన చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది. తను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. తనతో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 టైప్ లో ముద్దులు పెట్టమని సునిల్ ఫోన్ లో చెప్పడం.. తర్వాత అతని వీపు పగిలిపోవడం అంతా కామెడీగానే ఉంది. కానీ కంటెంట్ ఏమాత్రం కొత్తగా లేదనే చెప్పాలి. చూద్దాం..మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా ఈ  నలుగురికీ చాలా ఇంపార్టెంట్. హీరోగా అల్లరి నరేష్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. హీరో నుంచి కమెడియన్ మారిన తర్వాత సునిల్ చేస్తోన్న సినిమా కాబట్టి సెంటిమెంట్ గా హిట్ నే కోరుకోవాలి. అలాగే దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కూడా హిట్ చూసి చాలాకాలమైంది. అటు హీరోయిన్ కూ ఫస్ట్ మూవీ లక్ ఇవ్వలేదు. సో దీనిపై చాలా హోప్స్ పెట్టుకుంది. మరి వీరి హోప్స్ నెరవేరాలంటే థియేటర్ లో లెక్కలేనన్ని లాఫ్స్ పండాలి.. అప్పుడే కుదురుతుంది. 

More Related Stories