English   

పేప‌ర్ బాయ్ కు గీత‌గోవిందం సాయం.. 

Allu Aravind-Paper Boy
2018-08-27 01:37:14

మ‌నంమ‌నం బ‌రంపురం అన్న‌ట్లుంది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితి. ఓ చిన్న సినిమాకు మ‌రో చిన్న సినిమా సాయం చేయ‌క‌పోతే ఎలా..? ఇప్పుడు ఇదే చేస్తుంది గీత‌గోవిందం. ఈ సినిమాను ఇప్పుడు చిన్న‌ది అన‌డం బాగుండ‌దు. ఎందుకంటే 80 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది గీత‌గోవిందం. అయితే మొద‌లైంది మాత్రం చిన్న సినిమాగానే. ఇప్పుడు ఈ చిత్రానికి వ‌చ్చిన లాభాల‌తో మ‌రో చిన్న సినిమాను బ‌తికిస్తున్నాడు అల్లు అర‌వింద్. ఈయ‌న పేప‌ర్ బాయ్ సినిమా హ‌క్కుల‌ను తీసుకున్నాడు. సంప‌త్ నంది క‌థ అందించి నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించాడు. ఈ చిత్రం చూసి మెచ్చి.. వాళ్లు పెట్టిన బ‌డ్జెట్ కంటే కోటి రూపాయ‌లు ఎక్కువే ఇచ్చి హ‌క్కులు ద‌క్కించుకున్నాడు అల్లుఅర‌వింద్. బ‌న్నీవాసుకు కూడా ఈ చిత్రం చాలా బాగా న‌చ్చింది. గీతాఆర్ట్స్ విడుద‌ల చేసే విధంగా మెహ‌ర్ ర‌మేష్ రాయ‌బారం చేసాడ‌ని తెలుస్తుంది. ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది పేప‌ర్ బాయ్. చిన్న సినిమానే అయినా కూడా మంచి ఆస‌క్తితోనే వ‌స్తుంది ఈ చిత్రం. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా పుణ్య‌మా అని మ‌రో సినిమా కూడా బ‌తికేస్తుంద‌న్న‌మాట‌. 

More Related Stories