English   

రాజశేఖర్ కల్కిలో చాలా విషయాలున్నాయి

Rajasekhar-Kalki
2018-08-27 09:47:49

డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమా ‘కల్కి’. అఁ సినిమాతో ఆకట్టున్న ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. గరుడవేగ సినిమాతో ఇబ్బందులు పడ్డామని.. ఈచిత్రాన్ని తామే నిర్మించుకుంటున్నారు రాజశేఖర్ దంపతులు. గరుడ వేగ తర్వాత రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకోవడం వల్ల ఇక అతనికి హీరోగా ఛాన్సులు రాలేదనుకున్నారు చాలామంది. కానీ తనకు సరిపోయే కథ కోసం వెయిట్ చేశాడతను. ఫైనల్ గా ప్రశాంత్ వర్మ కథకు ఓకే చెప్పిన ఈ యాంగ్రీమేన్ ఇవాళ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని రీసెంట్ గా లీక్ అయిన పోస్టర్ ను బట్టి తెలిసింది. అయితే ఈ మోషన్ పోస్టర్ చూస్తే సినిమాలో చాలా విషయాలున్నట్టుగా తెలుస్తుంది. హిందూ మతాల ప్రకారం దేవుళ్లు ఇప్పటి వరకూ పది అవతారాల్లో వచ్చారని చెబుతారు. అందులో కల్కి అవతారం కూడా ఒకటి. అయితే ఈ టైటిల్ డిజైనింగ్ అద్భుతం అని చెప్పాలి. ఆ పది అవతారాలకు సంబంధించిన ఆయుధాలు లేదంటే ఆ దేవుళ్ల యూజ్ వల్ విషయాలతో కలిపి లోగో డిజైన్ చేశారు. అంటే మత్స్యావతారం నుంచి కల్కి వరకూ అన్నమాట. చేప, వరాహం, గొడుకు, గండ్రగొడ్డలి, రామబాణం, కృష్ణుడి వేణువు ఇలా.. వీటితో పాటు ఆయా దేవుళ్లు ఉపయోగించిన ఆయుధాలు కూడా ఉన్నాయీ లోగోలో. దీన్ని బట్టి రాజశేఖర్ పాత్ర అత్యంత పవర్ ఫుల్ గా ఉండబోతోందనే విషయం తెలుస్తుంది. ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు రాజశేఖర్ కు బాగా కలిసొస్తాయి. ఫస్ట్ మూవీతో తన టాలెంట్ ఏంటో చూపించిన ప్రశాంత్ వర్మ మరి ఈ మూవీతో ఎలా ప్రూవ్ చేసుకుంటాడో కానీ.. ఈ మోషన్ పోస్టర్ లోనే తన ప్రతిభను అద్భుతంగా చూపించాడు. 

More Related Stories