English   

విష్ణుకు ఆయ‌న ఇంకా ట‌చ్ లోనే ఉన్నాడా..? 

Vishnu-Manchu
2018-08-27 03:44:54

ప‌ది రోజుల కింది వ‌ర‌కు ఈయ‌న మామూలు డైరెక్ట‌ర్.. కానీ ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్. త‌న‌కే తెలియ‌కుండా రాత్రికి రాత్రే అగ్ర ద‌ర్శ‌కుడు అయిపోయాడు ప‌రుశురామ్. ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా ఈయ‌న‌కు కోరుకున్న గుర్తింపు ఎప్పుడూ రాలేదు. యువ‌త‌.. సోలో.. ఆంజ‌నేయులు.. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి సినిమాలు చేసినా కూడా ఈయ‌న్ని స్టార్స్ గుర్తించ‌లేదు. ఇక ఇప్పుడు విడుద‌లైన గీత‌గోవిందంతో క‌చ్చితంగా గుర్తించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ చిత్రం సృష్టిస్తున్న సంచ‌ల‌నం అలా ఉందిప్పుడు. సినిమా ఈజీగా 60 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. దాంతో ప‌రుశురామ్ కోసం గీతాఆర్ట్స్ మ‌రో సినిమా సైన్ చేసుకుంది. ఈ సారి ఏకంగా అల్లుఅర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు టైమ్ లోనే ప‌రుశురామ్ కు మంచు విష్ణుతో సినిమా కోసం అడ్వాన్స్ వ‌చ్చింది. అప్పుడే మంచు వార‌బ్బాయితో సినిమా చేయాల్సి ఉన్నా కూడా విజ‌య్ క‌మిట్ మెంట్ తో వెన‌క్కి వ‌చ్చేసాడు. ఇక విష్ణు కూడా గీత‌గోవిందం పూర్త‌య్యే వ‌ర‌కు ఏం మాట్లాడ‌లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఈ సినిమా టాపిక్ వ‌చ్చింది. ఇప్పుడు కానీ విష్ణుతో చేస్తే అది ఆయ‌న కెరీర్ కు యూజ్ అవుతుందేమో కానీ ప‌రుశురామ్ కు మాత్రం రిస్కే. అందుకే ఎలాగైనా త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నాడు. పైగా త‌న‌కు స్టార్ హీరోల‌తో ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని.. ఈ స‌మ‌యంలో అక్క‌డ ఏ సినిమా చేయ‌లేన‌ని త‌న స‌న్నిహితుల‌తో ఈ ద‌ర్శ‌కుడు చెబుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎలా ముగుస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మాట నిల‌బెట్టుకుంటే మంచోడు అవుతాడు.. వ‌దిలేస్తే చెడ్డోడైనా స్టార్ హీరోను ప‌ట్టుకుంటాడు. 

More Related Stories