English   

 విజ‌య్ పెళ్లి చేసుకుంటున్నాడా..? 

Vijay-Devarakonda
2018-08-27 10:56:53

హ‌లో మేడమ్ ఏం మాట్లాడుతున్నారు.. యామ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్ ఆఫ్ మై ఏరియా.. ఇది విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌గోవిందంలో ర‌ష్మిక‌తో చెప్పే డైలాగ్. కానీ ఇది నిజం కాదు.. ఈయ‌న ఏరియాకు కాదు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఇప్పుడు. ఈయ‌న పెళ్లి కోసం అభిమానులు కూడా చూస్తున్నారు. ఇప్పుడు విజ‌య్ సినిమా అంటే 50 కోట్ల రేంజ్ కు వెళ్లిపోయింది. దాంతో ఈయ‌న ఏం చేసినా ఇప్పుడు సంచ‌ల‌న‌మే. అటు ఇటు తిరిగి ఇప్పుడు విజ‌య్ పెళ్లి మీద టాపిక్ మొద‌లైంది. ఇప్ప‌టికే 29 ఏళ్లు రావ‌డంతో ఇంకెప్పుడు పెళ్లి అంటూ ర‌చ్చ మొద‌లైంది. ఇదిలా ఉంటే విజ‌య్ కూడా త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన క‌మెంట్లు చేసాడు. గీత‌గోవిందం చేసిన త‌ర్వాత త‌న‌కు కూడా పెళ్లి వీలైనంత త్వ‌ర‌గా చేసుకోవాల‌ని ఉంద‌ని చెప్పాడు. అయితే ఇప్పుడు కాదు.. కెరీర్ లో బిజీగా ఉన్నా క‌దా వ‌య‌సు 35 రాగానే పెళ్లికి సై అనేస్తాన‌ని చెప్పాడు ఈ హీరో. క‌చ్చితంగా ప్రేమ వివాహ‌మే చేసుకుంటాను కానీ ఇంట్లో చూసిన అమ్మాయిని మాత్రం కాద‌ని క్లారిటీ ఇచ్చేసాడు విజ‌య్. దాన్నిబ‌ట్టి ఎవ‌రో మ‌రి ఆ అమ్మాయి.. ఆల్రెడీ ఉందో.. ఇప్పుడు చూసుకోవాలో తెలియ‌దు. ఏదేమైనా ఇప్పుడు విజ‌య్ ఏం చేసినా ర‌చ్చే అబ్బా..!

More Related Stories