English   

అందాల నిధిపై మెగా హీరో క‌న్ను..!

Nidhhi-Agerwal
2018-08-27 15:18:39

ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు నిధి అగ‌ర్వాల్. ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే పాపుల‌ర్ అయిపోయింది ఈ భామ‌. దానికి కార‌ణం ఆమె అందాల ఆర‌బోత‌. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. ఎప్పుడు ప‌డితే అప్పుడు గ్లామ‌ర్ షోతో మ‌తులు చెడ‌గొడుతుంది నిధి. త‌న అందాల నిధి నిక్షేపాలు చూపించి ఫిదా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈమె అక్కినేని బ్ర‌ద‌ర్స్ తో న‌టిస్తుంది. స‌వ్య‌సాచి సినిమాతో తెలుగులో అడుగు పెట్ట‌నుంది ఈ ముద్దుగుమ్మ‌. నాగ‌చైత‌న్య‌-చందూమొండేటి కాంబినేష‌న్ లో ప్రేమ‌మ్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా ఇది. ప్ర‌స్తుతం ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ కూడా వ‌చ్చింది. ఈ మ‌ధ్యే నాగ‌చైత‌న్య సినిమాతో రెండు నెల‌ల త‌ర్వాత జాయిన్ అయింది ఈ భామ‌. దానికి ముందు అఖిల్ సినిమా కోసం లండ‌న్ లోనే ఉంది నిధి. అక్క‌డ ప‌ని పూర్తిచేసుకుని అన్న‌య్య ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది. ఇక్క‌డే త‌న బ‌ర్త్ డే సంబ‌రాలు కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అటు అన్న‌య్య‌.. ఇటు త‌మ్ముడుతో వ‌ర‌స సినిమాలు చేస్తూ టాలీవుడ్ కు గ్రాంట్ ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేసుకుంటుంది. ఇదిలా ఉండ‌గానే వ‌రుణ్ తేజ్ త‌ర్వాతి సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఈమె కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌రుణ్ ప్ర‌స్తుతం ఎఫ్ 2.. అంత‌రిక్షంతో పాటు సాగ‌ర్ చంద్ర‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇందులో నిధిని హీరోయిన్ గా తీసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ 2న స‌వ్య‌సాచి.. డిసెంబ‌ర్ 21న అఖిల్ సినిమా విడుద‌ల కానున్నాయి. మ‌రి వీటిలో నిధి కోరుకున్న విజ‌య‌పు నిధిని తీసుకొచ్చేది ఏదో..

More Related Stories