English   

త్రివిక్రమ్ భయపడ్డాడా..?

Aravinda-Sametha
2018-08-27 18:09:57

అరవింద సమేతవీరరాఘవ.. ఈ మధ్య సెకండ్ టీజర్ విషయంలో హాట్ టాపిక్ గా మారిన సినిమా. ముందు చాలారోజులుగా మరో టీజర్ వస్తుందంటూ ఊరించారు. వినాయక చవితి కానుకగా విడుదల చేయబోతున్నారని మహాజోరుగా వినిపించింది కూడా. కానీ ఫైనల్ గా తూఛ్ అన్నారు. అవన్నీ గాసిప్స్ అనీ.. అసలు రెండో టీజర్ ఉద్దేశ్యమే లేదనీ చెప్పుకొచ్చారు. కానీ దీని వెనక త్రివిక్రమ్ భయం ఉందనేది లేటెస్ట్ న్యూస్. అవును మొదటి టీజర్ కు డిజిటల్ వ్యూస్ అయితే బాగా వచ్చాయి కానీ.. పాజిటివ్ వ్యూస్ మాత్రం రాలేదనేది నిజం. ఓ మాస్ డైరెక్టర్ ఎన్టీఆర్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో త్రివిక్రమ్ అలాగే చూపించాడు తప్ప.. అతని మార్క్ ఏం లేదనీ.. అసలు ఇది త్రివిక్రమ్ సినిమానా.. లేక బోయపాటి సినిమానా అన్నవాళ్లు కూడా ఉన్నారు. దీంతో ఇప్పటికే అజ్ఞాతవాసి వంటి భయంకరమైన ఫ్లాప్ చూసిన త్రివిక్రమ్ నిజంగానే భయపడిపోయాడట. అందుకే ముందుగా రెండో టీజర్ ఆలోచన ఉన్నా.. ఈ టీజర్ కు వచ్చిన ఉద్దేశాలు చూశాక.. అనవసరంగా అవతలి వారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. 

ఇక ఇప్పుడు అరవింద సమేత పోస్టర్ సాంగ్ వస్తుంది అంటూ మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. అంటే టైటిల్ సాంగ్ అన్నమాట. ఇంకా చెబితే అరవింద సమేత వీరరాఘవుడిపై సాగే పాట. అయితే ఇది సినిమాలో మాంటేజ్ సాంగ్ గా ఉంటుందని వినికిడి. అలాంటి పాటను ముందే విడుదల చేస్తే అంచనాలు పెరుగుతాయి. అది సినిమాలో ముక్కలు ముక్కలుగా వినిపిస్తుంది. అప్పుడు డిజప్పాయింట్ అవుతారు. అందుకే ఈ విషయంలో కూడా టీమ్ డ్రాప్ అయిందని టాక్. మొత్తంగా అరవింద సమేత విషయంలో త్రివిక్రమ్ అతి భయాలకు పోతున్నాడనేది కూడా అర్థమౌతోంది. మరి మరీ ఇంతలా భయపడితే సినిమా అంత గొప్పగా ఉంటుందా అనే డౌట్స్ రాకుండా ఉంటాయా..? 

More Related Stories