English   

అదితి రావు అక్కడ పాగా వేస్తోందా..?

Aditi-Rao
2018-08-27 18:39:18

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా బ్రేక్ తెచ్చుకున్న బ్యూటీ అదితిరావు హైదరి. హైదరాబాదీ అయిన ఈ భామ చాలాకాలంగా బాలీవుడ్ లో బ్రేక్ కోసం చూస్తోంది. అక్కడ స్టార్ హీరోయిన్ కావడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా.. ఎందుకో అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయితే చాలామందికి తెలియదు కానీ.. అమ్మడు పదేళ్ల క్రితమే సౌత్ లో ట్రై చేసింది. 2007లోనే శృంగారం అనే తమిళ సినిమాలో నటించింది. ఆ సినిమాను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే తను బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడా బ్రేక్ రాకున్నా ఆఫర్స్ వస్తుండటంతో ఆగిపోయింది. కట్ చేస్తే 2017లో మణిరత్నం నుంచి వచ్చిన పిలుపు అమ్మడికి సౌత్ లో బ్రేక్ ఇచ్చింది. కాట్రువేలాయుదై సినిమాతో డాక్టర్ లీలా అబ్రహాంగా కలలో కూడా మర్చిపోలేని అందంతో ఆకట్టుకుంది. తర్వాత తెలుగులో సమ్మోహనం సినిమాతో సమ్మోహన పరిచింది. ప్రస్తుతం వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న అంతరిక్షం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న అదితి ప్రధానంగా తెలుగు కంటే తమిళ్ పైనే ఫోకస్ చేస్తోంది.  ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో ‘చెక్కచివంత వానమ్’ అనే సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా పార్వతి పాత్రలో నటిస్తోన్న అదితికి మరో తమిళ్ మూవీ ఆఫర్ వచ్చింది. డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే యంగ్ డైరెక్టర్ మిస్కిన్ సినిమాకు లేటెస్ట్ గా సైన్ చేసింది అదితి. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని మాత్రం చెబుతోంది కానీ.. అదెలాంటి పాత్ర అంటే చెప్పడం లేదు. ఏదేమైనా తను తమిళ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ అక్కడే పాగా వేయాలనుకుంటోందట. 

More Related Stories