English   

‘సైరా’లో పవన్ కళ్యాణ్  

Pawan-Kalyan-Sye-Raa
2018-08-27 18:59:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తనకున్న రేంజ్ ను కాస్త పక్కన బెట్టి పొలిటికల్ గా ఫుల్ బిజీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలే టార్గెట్ గా అతను మీటింగ్స్ కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాల్లో నటిస్తాడా అనే విషయంపైనా క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా పవర్ స్టార్ ‘సైరా’ టీమ్ తో కలిశాడు. అది కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి. ఇదుగో మీరు చూస్తోన్న ఫోటో వీళ్లంతా కలిసి సైరా సెట్లో దిగిందే. అయితే ఈ ఫోటో వచ్చిందని కాదు కానీ.. ఈ సినిమాలో ఏదో ఒక సీన్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడని సమాచారం. అవును.. మీరు విన్నది నిజమే. తన అన్న చేస్తోన్న ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో తనూ కనిపించాలని పవన్ అనుకున్నాడట. మరి పవన్ అనుకుంటే సీన్స్ కొదవా అని.. వెంటనే ఆ మేరకు ఓ చిన్న పాత్ర క్రియేట్ చేసి పవన్ ను ప్రవేశపెట్టబోతున్నట్టు టాక్. ప్రస్తుతం సైరా సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ అన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చిందీ టీజర్ కు. ఇంతకు ముందు కూడా పవన్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లో మెరిశాడు. ‘శంకర్ దాదా జిందాబాద్’ లో ఏకంగా చిరంజీవిని కాపాడే చిన్న ఫైట్ సీన్ కూడా చేశాడు.. మొత్తంగా పవన్ కళ్యాణ్ సైరా సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది పెద్ద పజిల్ గా మారింది. 

More Related Stories