English   

మూడు ముక్కల్లో మూడు లుక్కుల్లో రవితేజ .. 

Amar-Akbar-Anthony-First-look
2018-08-27 23:43:15

మాస్ మహరాజ్(..?)రవితేజ కొత్త సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ.  ప్రస్తుతం రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఈ టైమ్ లో రిస్క్ చేసి తనకంటే వీర ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స నిర్మిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రీసెంట్ గా టైటిల్ లుక్ చూపించిన టీమ్ ఈ సారి ఈ మూడు ముక్కల్లో రవితేజను చూపించారు. అదేనండీ.. మూడు ముక్కల్లో మూడు లుక్కులు చూపించారు. బట్ ఫస్ట్ లుక్ కే ఇలాంటి కమెంట్ చేశారేంటా అనుకోకపోతే.. నిజంగానే ఈ లుక్స్ లో ఏ మాత్రం కొత్తదనం లేదు. అతని గత సినిమాల్లోని గూగుల్ స్టిల్స్ ను ఇలా డిజైన్ చేసినట్టుగా ఉంది తప్ప.. ఆ టైటిల్ కు సరిపోయే లుక్ అయితే కాదిది. కాకపోతే టైటిల్ కు తగ్గట్టుగా అమర్ కో లుక్, అక్బర్ కో లుక్, ఆంటోనీకో లుక్ అనుకున్నారేమో.. అలాగే ఉంది. అన్నట్టు ఆమధ్య టైటిల్ చెప్పినప్పుడు ఉన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ అనే మాట ప్రతి లుక్ కూ ఉంది.

ఒకరు టై క్టుకుని సాఫ్ట్ వేర్ లా స్పెడ్స్ తో ఉన్నాడు. ఇతగాడు ఆంటోనీ అయి ఉంటాడనుకోవచ్చు. ఇక మెళ్లో తాయొత్తులు, నెత్తిన ముస్లీంటోపీ పెట్టుకున్నాడు కాబట్టి ఏరే ఆలోచన లేకుండా అతగాడు అక్బరే. ఇక మిగిలింది అమరే కదా.. అతనూ ఏం తక్కువ కాదు.. మాంచి గాగుల్స్ పెట్టుకుని కూసంత రఫ్ లుక్ తో ఉన్నాడు మరి. అన్నట్టు ఈ మూడు ముక్కల్తో పాటు ఉంకో ముక్క కూడా పెట్టారు. అందులో ముగ్గుర్నీ ఎట్టారు. అది కూడా బానే ఉందనుకోండి. కాకపోతే కొత్తగా మాత్రం అనిపించడం లేదు. మూడు లుక్స్ వచ్చాయి.. అంతే.. ఇక చాన్రోజుల తర్వాత ఈ సినిమాతో ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మొత్తంగా ఈ ముగ్గురికీ ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే రవితేజ, ఇలియానా అండ్ శ్రీను వైట్ల. మరి ఈ అమర్ అక్బర్ ఆంటోనీ ఈ ముగ్గురి ఫేట్ ను ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి. 

More Related Stories