English   

రామ్ చరణ్ మరో భారీ మల్టీస్టారర్..?

Kichcha-Sudeep
2018-08-28 08:36:25

ధృవ, రంగస్థలంతో కథల విషయంలో తన యాటిట్యూడ్ మొత్తం మార్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తోన్న చరణ్ నెక్ట్స్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా రామ్ చరణ్ చేయబోయే సినిమా మల్టీస్టారరే అని వినిపిస్తోంది. దీన్ని తన సొంత బ్యానర్ లోనే నిర్మించబోతున్నట్టు టాక్. పేరుకు మల్టీస్టారర్ అయినా అవతలి హీరో మనవాడు కాదు. ఓ కన్నడ స్టార్.. యస్.. ఈగతో ఇక్కడి వారినీ ఆకట్టుకున్న సుదీప్ తో పాటు రామ్ చరణ్ ఓ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మరోసారి సమంత రామ్ చరణ్ కు హీరోయిన్ గా నటిస్తుందని కూడా చెబుతున్నారు.  సుదీప్ మంచి ఆర్టిస్ట్. కన్నడలో టాప్ హీరో. కానీ కన్నడ దాటితే పాత్ర నచ్చితే ఏ సినిమా అయినా చేస్తాడు. ఇప్పటికే బాలీవుడ్ లోనూ ప్రూవ్ చేసుకున్న సుదీప్ కు తెలుగులో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. ఇదే టైమ్ లో రామ్ చరణ్ నిర్మిస్తోన్న సైరాలో భారీ ఆఫర్ వచ్చింది. ఆ టైమ్ లోన చరణ్ తో మంచి బాండింగ్ ఏర్పడిందట సుదీప్ కు. దీంతో ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందంటున్నారు. కాకపోతే చరణ్ కు కాస్త ఎక్కువ ప్రియారిటీ ఉంటుందనేది ముదే ఊహించొచ్చు. కానీ రామ్ చరణ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్స్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగానే ఉంది. పైగా మరోసారి సమంత కూడా ఓకే చెప్పిందంటే.. ఖచ్చితంగా కథలో ఏదో స్టఫ్ ఉండే ఉంటుంది. ఏదేమైనా ఈ మల్టీస్టారర్ కు నిర్మాతతో ప్రాబ్లమ్ లేదు కానీ.. దర్శకుడెవరు.. కథ ఎలా ఉంటుందనే విషయాలు త్వరలోనే తెలియజేస్తారట. 

More Related Stories