English   

నర్తనశాల అప్పుడే సగం డబ్బులు వచ్చాయ్

Nartanasala-Business
2018-08-28 09:04:13

యంగ్ హీరో నాగశౌర్య సొంత బ్యానర్ లో చేసిన సినిమా @నర్తనశాల. ముందు నుంచీ కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తోన్న ఈ మూవీకి ఆల్రెడీ సగం డబ్బులు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ @నర్తనశాల ట్రైలర్ తో పాటు, పాటలకూ మంచి స్పందన వచ్చింది. ఇక హీరోయిన్లుగా నటించిన కశ్మీరా, యామినీ భాష్కర్ ల అందాలు థియేటర్ లో అదనపు ఆకర్షణ కానున్నాయని ఇప్పటికే ఫీలర్స్ వచ్చాయి. మొత్తంగా నాగ శౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో మరో హిట్ కొట్టబోతోన్న కళ కనిపిస్తోంది. అయితే హిట్ కొట్టినా కొట్టకున్నా లాస్ మాత్రం ఉండదనేది లేటెస్ట్ న్యూస్. ఈ మూవీని ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ కు అమెజాన్ కు అమ్మేశారు. అలాగే శాటిలైట్ కూడా అయిపోయింది. ఈ రెండిటితో కలిపి మూడున్నర నుంచి నాలుగు కోట్ల వరకూ బ్యాగ్ చేసుకున్నారట. ఇంకా థియేట్రికల్ రైట్స్ విషయం తేలలేదు. ఎంత లేదాన్న ఛలో 10కోట్ల వరకూ కలెక్ట్ చేసింది కాబట్టి.. ఈ మూవీకి ఆ రేట్ రావడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఈ అమెజాన్, శాటిలైట్ ద్వారా వచ్చిందే బడ్జెట్ లో సగం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఈ మూవీకి అయిన ఖర్చు 8-10కోట్లు. ఇందులో ప్రమోషన్స్ కూ భారీగా ఖర్చుపెడుతున్నారు. మరి అలాంటి లో బడ్జెట్ సినిమాకు ఈ రేంజ్ లో రేట్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఆ లెక్కన @నర్తనశాల హిట్ టాక్ తో సంబంధం లేకుండా ఐరా క్రియేషన్స్ కు లాభాలు వచ్చేస్తాయి. హిట్ అయితే అది బోనస్ ప్రాఫిట్స్ అవుతాయి.

More Related Stories