English   

నాగార్జున‌ను రిస్క్ లో పెడుతున్న నాని.. 

Nani-Devadas
2018-08-28 03:40:59

ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న చేస్తున్న ప‌ని ఇప్పుడు నాగార్జున‌ను కూడా రిస్కులో పెడుతున్న‌ట్లు అనిపిస్తుంది. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. నాని ఇప్పుడు హీరో మాత్ర‌మే కాదు.. బిగ్ బాస్ సీజ‌న్ 2 హోస్ట్ కూడా. అయితే బిగ్ బాస్ 2పై ఓ బ్యాడ్ సెంటిమెంట్ పాకిపోయింది ఇండ‌స్ట్రీలో. ఈ షోకు ఎవ‌రైనా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌చ్చారంటే ఆ సినిమా ప్లాప్ అనేది అంతా న‌మ్మేస్తున్నారు ఇప్పుడు. దాంతో ఎక్కువ‌గా రావ‌డం లేదు కూడా. ఇప్ప‌టికే చాలా సినిమాలు ఇలా వ‌చ్చి ఫ్లాప్ అయిన‌వి కూడా ఉన్నాయి. లేటెస్ట్ ఎంట్రీ నీవెవ‌రో. ఆది హీరోగా న‌టించిన ఈ చిత్రం కూడా డిజాస్ట‌ర్ అయింది.  ఆ సినిమా బాలేదు కాబ‌ట్టి ఫ్లాప్ అయింది అందులో బిగ్ బాస్ 2 కూడా పార్ట్ అయింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్ 2 ఇంట్లోకి వెళ్లారు చిత్ర‌యూనిట్. ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారి క‌లిసి రాదు అన్న త‌ర్వాత ఆ వైపు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతుంటారు హీరోలు. కానీ నాని మాత్రం ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న దేవ‌దాస్ ప్ర‌మోష‌న్స్ అన్నీ బిగ్ బాస్ 2లో హౌజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. రిస్క్ అని తెలిసినా కూడా త‌న షోపై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు తానే చెక్ పెట్టాల‌ని ఫిక్సైపోయాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టికే ఈ షోలో దేవ‌దాస్ టీజ‌ర్ కూడా ప్లే చేసాడు నాని. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ తో పాటు సినిమా కూడా ప్ర‌త్యేకంగా షో వేస్తానంటున్నాడు. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది దేవ‌దాస్. మ‌రి ఈయ‌న తీసుకుంటున్న రిస్క్ కు ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!
 

More Related Stories