English   

ఆస్తులు రాయించుకుంటున్న సునీల్.. 

Sunil-Remuneration
2018-08-28 11:07:42

ప‌దేళ్ళ త‌ర్వాత అమ్మాయి పుట్టింటికి వ‌స్తే ఎలా ఆహ్వానిస్తారు.. ఇప్పుడు సునీల్ ను కూడా మ‌న ద‌ర్శ‌కులు అలాగే ఆహ్వానిస్తున్నారు. ఆ మ‌ధ్య హీరోగా సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ అవుతున్నాడు. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. హీరోగా ఇక చాలు అనుకుంటున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. దేన్నైనా తెగేవ‌ర‌కు లాగ‌కూడ‌దు. ఇప్పుడు సునీల్ చేస్తున్న‌ది కూడా ఇదే. ఇక నువ్వాప‌రా బాబూ అనేవ‌ర‌కు తెచ్చుకుంటే.. క‌మెడియ‌న్ గా చేసినా కూడా చూడ‌రు. అందుకే ముందు జాగ్ర‌త్త‌తో అవి మానేసి కామెడీ వైపు అడుగేసాడు. ఈయ‌న సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా క‌నిపిస్తుంది. అవును.. 20 ఏళ్ల కెరీర్ లో సునీల్ కు ఎన్న‌డూ లేని విధంగా నెక్ట్స్ ఏంటి అనే ప్ర‌శ్న కూడా వ‌చ్చింది. ఓ సినిమా పూర్త‌య్యే లోపు మ‌రో రెండు మూడు లైన్ లో ఉండేవి. హీరో అయ్యాక‌ కూడా సునీల్ కు ఈ టైమ్ న‌డిచింది. కానీ ఇప్పుడు పూర్త‌యిన‌ట్లుంది. 

2 కంట్రీస్ త‌ర్వాత ఈయ‌న పూర్తిగా హీరోగా సినిమాలు మానేసాడు. ఇప్ప‌టికే ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌లో అదిరిపోయే పాత్ర‌లో న‌టిస్తున్నాడు సునీల్. స్నేహితుడే కావ‌డంతో సునీల్ కోసం మంచి కామెడీ రోల్ రాస్తున్నాడు త్రివిక్ర‌మ్. దానికి త‌గ్గ‌ట్లే ఇప్పుడు మున‌ప‌టి రూపంలోకి మారిపోతున్నాడు సునీల్. ఇక శీనువైట్ల‌-ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలోనూ న‌టిస్తున్నాడు సునీల్. దాంతో పాటు అల్ల‌రినరేష్-భీమినేని శ్రీ‌నివాస‌రావు సిల్లీఫెలోస్ సినిమాలో ఉన్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. సైరా లోనూ ఓ పాత్ర కోసం అడిగారంటూ అప్ప‌ట్లో చెప్పాడు సునీల్. సాయిధ‌రంతేజ్-కిషోర్ తిరుమ‌ల చిత్ర‌ల‌హ‌రి సినిమాలోనూ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ క‌మెడియ‌న్స్ కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్.. ప‌దేళ్ళ త‌ర్వాత వ‌చ్చి తీసుకుంటున్నాడు సునీల్. రోజుకు క‌నీసం 4 ల‌క్ష‌ల వ‌ర‌కు సునీల్ కి స‌మ‌ర్పించుకుంటున్నారు నిర్మాత‌లు. మొత్తానికి మ‌ళ్లీ ఈయన కామెడీ ప్ర‌యాణం మొద‌లైంది. 

More Related Stories