English   

బ‌స‌వ‌తార‌కమ్మ‌ను చ‌దివేస్తున్న విద్యాబాల‌న్..

Vidya-Balan
2018-08-28 12:20:45

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి విద్యాబాల‌న్ ఒప్పుకుంది. ఇప్ప‌టికే షూటింగ్ కు కూడా వ‌చ్చింది ఈ భామ‌. ఇందులో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టిస్తుంది విద్యాబాల‌న్. ఈ పాత్ర చేయ‌డం అంటే అంత ఈజీ కాదు. పైగా ఈ చిత్ర క‌థ ఈమె పాత్ర‌తోనే మొద‌లై.. ఈమె పాత్ర‌తోనే ముగిసిపోతుంది. అంటే ఎన్టీఆర్ జీవితాన్ని భార్య కోణంలో చెబుతున్నాడు క్రిష్. అందుకే ఇలాంటి పాత్ర కోసం విద్యాబాల‌న్ అయితేనే ప‌క్కాగా సూట్ అవుతుంద‌ని భావించి మ‌రీ ఆమెనే తీసుకొచ్చాడు క్రిష్. అస‌లు ఈ పాత్ర చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క్రిష్.. అవును.. ఇప్పుడు బాలీవుడ్ లో క్రిష్ కు ఓ మార్కెట్ ఉంది.. ఆయ‌నంటే గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే గ‌బ్బర్ ఈజ్ బ్యాక్ తో త‌న‌ను త‌ను నిరూపించుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు కంగ‌న‌తో మ‌ణిక‌ర్ణిక సినిమా చేస్తున్నాడు.

ఈయ‌న ప‌నిత‌నం గురించి తెలుసుకున్న త‌ర్వాతే విద్యా సైతం క్రిష్ తో ప‌ని చేయ‌డానికి ఓకే అనేసింది. పైగా ఈ పాత్ర‌ను తాను చాలా ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుంటుంది విద్యాబాల‌న్. ఎన్టీఆర్ జీవితంలో కీల‌క‌పాత్ర పోషించింది బ‌స‌వ‌తార‌కం. ఆయ‌న సినిమాల్లో బిజీగా ఉన్న‌పుడు 13 మంది సంతానాన్ని తానే చూసుకుని పెంచింది బ‌స‌వతార‌క‌మ్మ‌. అలాంటి పాత్ర చేయాలంటే క‌చ్చితంగా చాలా అనుభ‌వం ఉన్న న‌టి కావాల్సింది. క్రిష్ కూడా ఆమెకు చెప్పిన విధానం అలా ఉంది. దాంతో మ‌రో మాట లేకుండా ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌డానికి ఒప్పుకుంది విద్యా బాల‌న్. పైగా ఈ పాత్ర వివ‌రాల‌ను ఎన్టీఆర్ కూతుళ్ల‌ను అడిగి తెలుసుకుంటుంది విద్యాబాల‌న్. క‌చ్చితంగా తాను ఈ పాత్ర‌కు పూర్తిస్థాయి న్యాయం చేస్తాన‌ని చెబుతుంది విద్యా. జ‌న‌వ‌రి 9న విడుదల కానుంది ఎన్టీఆర్. న్న‌ట్లు శాత‌క‌ర్ణి కోసం హేమామాలినిని తీసుకొచ్చాడు క్రిష్. ఇక ఇప్పుడు విద్యాబాల‌న్ వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈమె పాత్ర ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories