English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. హోల్ ఆంధ్రా కొత్త మొగుడు..!

Vijay-Devarakonda
2018-08-28 14:41:36

వార‌సులు కాకుండా సొంతంగా వ‌చ్చి స్టార్ హీరో అనే ముద్ర వేసుకున్న వాళ్లు చాలా కాలం అయింది. నానిని స్టార్ హీరో అంటున్నారు కానీ క్రేజ్ ప‌రంగా ఇప్ప‌టికీ ఈయ‌న స్టార్స్ కంటే త‌క్కువ‌గానే ఉన్నాడు. ఈయ‌న మార్కెట్ ఇంకా 40 కోట్ల ద‌గ్గ‌రే ఉంది. కానీ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చాడు. ఈయ‌న రేంజ్ 100 కోట్ల‌కు చేరిపోయిందిప్పుడు. ఇన్నాళ్లూ తెలంగాణ మెగాస్టార్ అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా నితిన్ అనేవాళ్లు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో నైజాం నుంచి కొద్దోగొప్పో ఇమేజ్ ఉన్న  హీరో ఆయ‌న ఒక్క‌డే కాబ‌ట్టి. 

కానీ ఇప్పుడు ఆయ‌న‌కు మొగుడు వ‌చ్చేసాడు. అత‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చూస్తుంటు ఈ కుర్ర హీరో నైజాం ఒక్క‌టే కాదు.. హోల్ ఆంధ్రాకే మొగుడ‌య్యేలా క‌నిపిస్తున్నాడు. ఈ హీరో అరాచ‌కాలు అలా ఉన్నాయి మ‌రి ఇప్పుడు. గీత‌గోవిందం ర‌చ్చ చూస్తుంటే అస‌లు ఇది చిన్న హీరో సినిమా అని.. మార్కెట్ త‌క్కువ అని ఎవ‌రూ ఊహించ‌డం లేదు. ఈ సినిమా విడుద‌లైన 13 రోజుల త‌ర్వాత 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. అందులో షేర్ 53 కోట్లు ఉంది. ఇంటా బ‌య‌టా ర‌చ్చ చేస్తుంది ఈ చిత్రం. 

ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 2 మిలియ‌న్ దాటేసింది ఈ చిత్రం. ఇప్ప‌టికీ దున్నేస్తూనే ఉంది. చాలా మంది హీరోల లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్ల‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ ఇట్టే దాటేసాడు. ఇప్పుడు ఈయ‌న క్రేజ్ చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేరు. ఇప్ప‌టికే పెళ్లిచూపులు.. అర్జున్ రెడ్డి సినిమాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన విజ‌య్.. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల‌తో అరాచ‌కాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికీ సినిమాకు టికెట్స్ దొర‌క‌డం లేదంటే ర‌చ్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఫుల్ ర‌న్ లో ఈజీగా 60 కోట్ల షేర్ అందుకునేలా క‌న‌బ‌డుతుంది గీత‌గోవిందం. అలా తెలంగాణకు కాదు.. హోల్ ఆంధ్రాకు మొగుడు అయిపోతున్నాడు విజ‌య్. 

More Related Stories