English   

ఐదు భాగాలుగా వస్తున్న శ్రీరెడ్డి

Actress Sri Reddy Mallidi Biopic Movie Reddy Dairy
2018-08-29 06:17:20

ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్య‌క్తి ఓ గొప్ప‌వాడో.. లేదంటే ఆయ‌న నుంచి స‌మాజం ఎంతోకొంత నేర్చుకోవాల‌నో ఉద్దేశ్యం అయితే ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌నిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. బ‌యోపిక్ అంటే డ‌బ్బులు దండుకోవ‌డం.. బిజినెస్ చేయడం. సినిమా ఎలాగూ బిజినెస్ అయిపోయింది.. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ క‌నీసం కొద్దోగొప్పో విలువ‌లు అయితే ఇంకా ఉన్నాయ‌నే న‌మ్ముతున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు వ‌స్తోన్న కొన్ని ప‌రిస్థితుల‌ను సినిమాల‌ను చూస్తుంటే అవి లేవేమో భ‌యం కూడా వేస్తుంది. శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ కు శ్రీకారం చుట్ట‌డం చూస్తుంటే ఇది నిజం కాదా అని అడుగుతున్నారంతా.

అస‌లు శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ అంటేనే ఎందుకు అంటున్నారు ఇప్పుడు ప్రేక్ష‌కులు. అలాంటిది ఇప్పుడు మ‌రో బాంబ్ కూడా పేల్చింది ఈ భామ‌. త‌న బ‌యోపిక్ ఒక్క భాగంలో కాదు ఏకంగా ఐదు భాగాలుగా వ‌స్తుంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇదేమైనా మ‌హాభార‌తమా.. లేదంటే రామాయ‌ణ‌మా అంటూ ప్రేక్ష‌కులు కూడా సెటైర్లు వేస్తున్నారు ఈ బ‌యోపిక్ పై. అయినా చెప్పేవాళ్ల‌కు ఏమో కానీ తీసేవాళ్ల‌కు అయినా తెలివి కాస్త ఉండాలి క‌దా.. ఒకేసారి ఐదు భాగాలంటే ఏమైపోతారో జ‌నం అంటున్నారు. పోనీ శ్రీ‌రెడ్డి జీవితంలో అలాంటి అద్భుత‌మైన సంఘ‌ట‌న‌లు ఏమైనా ఉన్నాయా అంటే అవీ కాదు.. నిర్మాత‌ల త‌న‌యుల‌తో రాస‌లీల‌లు త‌ప్ప‌.

శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ చేయాల్సినంత గొప్ప ఫిగ‌ర్ అయితే కాదు క‌దా..! ఫిగ‌ర్ అంటే ఇక్క‌డ విలువలున్న మ‌నిషి అని అర్థం. పైగా ఈమె బ‌యోపిక్ కు మ‌ళ్లీ అమ్మ ఆశీస్సులు ఒక‌టి. చెన్నై జ‌య‌ల‌లిత ఆశీసుల‌తో రెడ్డిడైరీ మొద‌లైంది. మ‌న ద‌గ్గ‌ర ఉంటూ.. మ‌న ఇండ‌స్ట్రీ ప‌రువు మొత్తం తీసిన శ్రీ‌రెడ్డిపై ఇప్పుడు సెల్వం అనే అరవ ద‌ర్శ‌కుడు బ‌యోపిక్ చేస్తున్నాడు. మ‌రి ఈ సినిమాలో ఎలాంటి నిజాలు చూపిస్తారో.. ఎలాగూ రోడ్ల‌పై న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా చేసింది క‌దా.. అవి కూడా సినిమాలో ఉంటాయేమో..? అస‌లు బ‌యోపిక్ అనే ప‌దానికి అర్థం లేకుండా చేస్తున్నాయి ఈ మ‌ధ్య వ‌చ్చే కొన్ని బ‌యోపిక్ లు. ఇక చూడాలి.. శ్రీ‌రెడ్డి గారి అద్భుతమైన సుందర దృశ్య కావ్యం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories