English   

పూజాహెగ్డే ఎన్టీఆర్ కోసమే ఆ పని చేస్తుంది

Pooja Hegde Started Own Dubbing For Aravindha Sametha
2018-08-29 04:36:25

పూజాహెగ్డే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ పేరు తెలియ‌ని వాళ్లంటూ ఎవ‌రూ ఉండ‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేకుండానే ఫ్యూచ‌ర్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ‌. విన‌డానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ముందే ఎలా చెబుతున్నారు.. ఈ భామ జాత‌కం ఏమైనా చూసారా అనే అనుమానాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈమె చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తుంటే అలా ఉంది మ‌రి. డిజే త‌ర్వాత ఆర్నెళ్లు ఖాళీగా ఉంటే పూజాను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే పాపం అనుకున్నారంతా. కానీ అది తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అని ఎవ‌రూ అనుకోలేదు. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ చేసింది పూజాహెగ్డే. జిగేల్ రాణి అంటూ ర‌చ్చ ర‌చ్చ చేసింది.

ఇక ఇప్పుడు ఈ భామ చేతిలో మూడు భారీ సినిమాలున్నాయి. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మ‌తే సినిమా.. మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి మ‌హ‌ర్షి సినిమా.. ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈమె అర‌వింద స‌మేత‌తో బిజీగా ఉంది. పైగా ఈ చిత్రంలో సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. ఇప్ప‌టికే మొద‌లు పెట్టింది కూడా. థ‌మ‌న్ కూడా ఈ చిత్రానికి ఆర్ఆర్ వాయించ‌డం మొద‌లుపెట్టాడు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

సెప్టెంబ‌ర్ 20 నాటికి షూట్ పూర్తి చేసి అక్టోబ‌ర్ లో సినిమా విడుద‌ల చేయాల‌నేది త్రివిక్ర‌మ్ ప్లాన్. అస‌లు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో తోటి హీరోయిన్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న పూజా.. ఇప్పుడు ఓన్ డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెడితే అంతే సంగ‌తులు. వాళ్ళింక చిప్ప‌లు ప‌ట్టుకోవాల్సిందే. మొత్తానికి తెలుగులో తొలి హిట్ కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్ని చేస్తుంది పూజా. మ‌రీ ఈమె గోడు ఏ దేవుడు వింటాడో..?

More Related Stories