English   

నంద‌మూరి ఫ్యామిలీకి న‌ల్.. గండం..!

Nalgonda-harikrishna-family
2018-08-29 12:15:10

ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మ‌రి. ఏ పాడుకన్ను ప‌డిందో కానీ న‌ల్లొంగ దారిలో నంద‌మూరి కుటుంబానికి ప్ర‌మాదాలు వేచి చూస్తున్నాయి. ఒక‌టి రెండు అనుకుంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు మూడో ప్రమాదం కూడా జ‌రిగింది. ఈ ప్ర‌మాదాల ఫ‌లితం రెండు నిండు ప్రాణాలు. హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డంతో అభిమానుల‌తో పాటు పార్టీ శ్రేణులు కూడా దిగ్భ్రాంతికి లోన‌య్యారు. ఇక ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టిస్తుంది. న‌ల్గొండ శివార్ల‌లోనే నంద‌మూరి కుటుంబానికి వ‌ర‌స యాక్సిడెంట్స్ అవుతుండ‌టం అంద‌ర్నీ ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది. 

2014 డిసెంబర్‌లో నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ క‌న్నుమూసారు. అప్ప‌ట్నుంచీ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ప్ర‌తీ సినిమాలో.. ఆడియో వేడుక‌లో.. ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌లో ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లండి.. త‌మ కుటుంబంలో జ‌రిగిన ప్ర‌మాదం మ‌రే కుటుంబంలో జ‌ర‌క్కూడ‌ద‌ని జాగ్ర‌త్త‌లు చెబుతుంటాడు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఇదే కుటుంబంలో ఇంకో వ్య‌క్తి కూడా ఇలాంటి ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించ‌డంతో అంతా షాక్ అయిపోతున్నారు. జాన‌కీరామ్ అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా రోడ్డు మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

ఇక ఇదే నల్గొండ జిల్లా మోతె సమీపంలో 2009 ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఓ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. అయితే ఇప్పుడు హ‌రికృష్ణ కూడా ఇదే ప్రాంతంలోక్సిడెంట్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. న‌ల్గొండకు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో నంద‌మూరి కుటుంబానికి న‌ల్ గండం పొంచిఉంది. 

More Related Stories