English   

హరికృష్ణ ఎప్పుడూ ఒంటరే..నా?

Nandamuri Harikrishna Can't Believe Chandhra Babu Naidu
2018-08-29 13:20:15

హరికృష్ణ రాజకీయంగా ఎదగలేకపోవడానికి చాలా కారణాలే చెప్పొచ్చు. తండ్రి బ్రతికి ఉన్నంత వరకూ ఆయనకు కుడి భుజంగా వ్యవహరించిన హరికృష్ణకు తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆయన తండ్రికి తెలియకుండానే చంద్రబాబుకు సపోర్ట్ చేశాడు. ఇదే హరికృష్ణ చేసిన పెద్ద తప్పు. ఈ తప్పుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడమో లేదా విమర్శించడానికో పరిమితమైపోయింది తప్ప రాజకీయంగా.. తండ్రి స్థాపించిన పార్టీలో క్రియాశీలక స్థాయిలో నిలవక పోవడానికి ఆయన ఆ తప్పే ప్రధానమైనదని చెప్పొచ్చు. చంద్రబాబును సపోర్ట్ చేయడం ద్వారా పార్టీలో కనీసం సెకండ్ ప్లేస్ అయినా వస్తుంది.. ఆ తర్వాత తానే నెంబర్ వన్ కావచ్చనేది అతని వ్యూహం కావొచ్చు. కానీ పొలిటికల్ చాణక్యుడుగా ఉన్న చంద్రబాబు ముందు హరి ఆటలు సాగలేదు. అప్పటి నుంచి ఆయన ఒంటరి పోరాటం మొదలైంది.

తండ్రి మరణించిన అతి కొద్ది కాలానికే చంద్రబాబుతో విభేదాలు వచ్చాయి. దీంతో తనే సొంతంగా అన్న తెలుగుదేశం అనే పార్టీని స్థాపించాడు. కానీ సరైన కేడర్ లేకపోవడంతో ఆ పార్టీని కొనసాగించలేకపోయాడు. కానీ ఏమాటకామాటే.. ఆయన అప్పుడు వేరే పార్టీలో చేరి ఉండొచ్చు. కానీ తండ్రి స్థాపించిన పార్టీనే నమ్ముకున్నాడు. అందులో నుంచి బయటకు వెళ్లాలనుకోలేదు. ఇక ఎప్పుడైనా చంద్రబాబుకు తప్పు చేస్తే బాహాటంగానే విమర్శించాడు. దీంతో చంద్రబాబు ఆయన్ని పూర్తిగా పక్కన బెట్టారు. అప్పటి నుంచీ ఆయన పార్టీలో ఒంటిరిగానే మిగిలిపోయారు. తన మాట వినేవారు లేరు.. తనకూ ప్రాధాన్యం లేదు. అయినా తండ్రి స్థాపించిన పార్టీ నుంచి బయటకు రావాలనే ఆలోచన మాత్రం చేయలేదు.

2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నప్పుడు కొంత ప్రాధాన్యం ఇచ్చినట్టే ఇచ్చాడు చంద్రబాబు. కానీ అప్పుడు ఓడిపోవడంతో మళ్లీ పక్కనబెట్టారు. ఇదే క్రమంలో నందమూరి కుటుంబంతో కూడా విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణతో కుటుంబ పరంగా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ బాలయ్య కుటుంబంతో వీరికి మాటలు కూడా లేవు. అదే సమయంలో నందమూరి కుటుంబంతో కూడా దూరంగా ఉంటున్నారు. అత్యంత ప్రాధాన్యం ఉంటే తప్ప ఆ కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా హాజరు కావడం లేదాయన. మొత్తంగా దాదాపు హరికృష్ణ 25యేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారని చెప్పాలి. ఆయనకు అటు పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ సరైన సపోర్ట్ ముందు నుంచీ లేదు. ఇక ఇదే సమయంలో పెద్ద కొడుకు జానకిరామ్ మరణం మరింత కుంగదీసింది. అంతకు ముందే షుగర్ ముదిరిపోయి ఓ దశలో సీరియస్ అనే మాటా వినిపింది. ఇలా ఎన్నిటినో తట్టుకున్న గుండెధైర్యం హరికృష్ణది.

More Related Stories