English   

అన్నగారు అసెంబ్లీకి.. హరికృష్ణ అంతిమయాత్రకు

TDP Leader Harikrishna Nandamuri Dead March in Chaitanya Ratham
2018-08-29 14:41:12

నందమూరి హరికృష్ణ మరణం ఆ కుటుంబాన్ని కుదిపివేసింది. అభిమానుల్ని కలచివేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆయన మరణించిన నార్కట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. అటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. బాలకృష్ణ, హరికృష్ణ బావ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ బాబు హాస్పిటల్ కు వచ్చి  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు సానుభూతి తెలియజేశారు. ఇవాళ హరికృష్ణ శవాన్ని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం వద్ద సందర్శకుల కోసం ఉంచుతారు. రేపు ఉదయం దహన సంస్కారాలు నిర్వహిస్తారు.

ఇక హరికృష్ణ దహన సంస్కారాల కోసం ఆయనకు ఎంతో ఇష్టమైన ‘చైతన్య రథం’ను వినియోగించబోతున్నారు. ఇప్పటికే ఆ రథానికి రిపేర్స్ మొదలుపెట్టారు. నిజానికి ఇది అప్పట్లో ఆయన వాడినప్పటికే పాతది. కానీ దగ్గరుండి మరీ దాన్ని బాగు చేయించి ఫుల్ కండీషన్ లో ఉండేలా మార్పులు చేశారు. అన్ని వసతులు ఉండేలా ఈ చైతన్యరథాన్ని మోడ్రేడ్ చేశాడు. ఆ రథం నుంచి అన్నగారు అసెంబ్లీకి వెళితే.. ఆ రథం హరికృష్ణ అంతిమయాత్రకూ ఉపయోగిస్తుండటం శోచనీయం.

More Related Stories