English   

సంతోషంలో ఈషారెబ్బా...

Actress Eesha Rebba Hot Photoshoot at Santhosham Awards
2018-08-29 19:13:37

అవునా.. అంత‌గా ఏమైంది.. మొన్న ఈమె న‌టించిన బ్రాండ్ బాబు కూడా ఫ్లాప్ అయింది క‌దా ఇప్పుడు ఎందుకు మ‌రి ఈ సంతోషం అనే డౌట్ వ‌స్తుంది క‌దా..! అందులో న్యాయం ఉంది.. కానీ ఇప్పుడు ఈ భామ సంతోషానికి మ‌రో కార‌ణం ఉంది. తాజాగా ఈషా సంతోషం అవార్డ్ ఫంక్ష‌న్ లో త‌న వంతుగా పార్టిసిపేట్ చేయ‌డ‌మే కాకుండా డాన్సులు కూడా చేసింది. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ప్ర‌తీ వేడుక‌లోనూ క‌నిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికి ప్ర‌త్యేకంగా కార‌ణాలేం లేవు కానీ ఈ మ‌ధ్య పెద్ద హీరోలు కూడా ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి ముందుకొస్తున్నారు.

ఇప్పుడు అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది ఈషా. దాంతోపాటు సుమంత్ హీరోగా వ‌స్తున్న సుబ్ర‌మ‌ణ్య‌పురంలోనూ న‌టిస్తుంది ఈషా. ఈ రెండు సినిమాల‌తో త‌న కెరీర్ మ‌రో స్థాయికి చేరుతుంద‌ని ఆశిస్తుంది. అందుకే ఇప్పుడు అందాల ఆర‌బోత‌కు కూడా సై అనేస్తుంది. తాజాగా సంతోషం అవార్డ్ వేడుక‌లో కూడా క్యూట్ అండ్ హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఇషారెబ్బా. ఈ మ‌ధ్య చిన్న‌చిన్న‌చ‌డ్డీల‌తో ఉసురు కూడా తీస్తుంది. మొత్తానికి ఈ తీరు చూసిన త‌ర్వాత ఏ ద‌ర్శ‌కుడైనా ఇట్టే ప‌డిపోతాడు ఈ భామ‌కు.

More Related Stories