English   

మొగుడూపెళ్లాల సవాల్

Shailaja-Reddy-Alludu-vs-U-Turn
2018-08-29 19:35:20

అవును.. నిన్నటి వరకూ ఉంటుందా అనుకున్నవారికి ఇక తేలిపోయింది. ఇది మొగుడూ పెళ్లాల సవాల్. ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ వార్ కు సిద్ధమయ్యారు. ఎవ్వరూ వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఎవరికి వారు డేట్ అనౌన్స్ చేశారు. అది సేమ్ డేట్ కావడంతో ఇప్పుడీ ఇద్దరి మధ్య పోటీ తప్పడం లేదు. యస్.. ఇన్నాళ్లూ సమంతా చైతన్య గా ఉన్న ఈ జంట సమంత వర్సెస్ చైతన్యగా మారారు. అయితే ఈ విషయంలో ‘‘సమంత వర్సెస్ చైతూ కాదు.. సమంతతో చైతూ’’ శామ్ ట్వీట్ చేసింది. కానీ జనాలు అలా అనుకుంటారా.. కోరు కదా. అందుకే ఇది ఖచ్చితంగా సమంత వర్సెస్ చైతూనే అనేది బాక్సాఫీస్ గురించి తెలిసిన ఎవరికైనా అర్థమౌతుంది. 

ముందు నుంచీ చెబుతున్నట్టుగానే సమంత కొత్త సినిమా ‘యూ టర్న్’ సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ డేట్ తో పోస్టర్స్ కూడా కొట్టించారు. వీరికి కాస్త టైమ్ తీసుకుని నాగ చైతన్య ‘ శైలజారెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు వస్తున్నట్టు ప్రకటించారు. వీళ్లూ పోస్టర్స్ కొట్టించారు. దీంతో మొగుడూ పెళ్లాల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారు అనుకున్నవారికి ఈ నిర్ణయం సర్ ప్రై్జ్ చేసింది. అంటే ఎవ్వరూ తగ్గడం లేదన్నమాట.

సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. మారుతి డైరెక్షన్ లో వస్తోన్న సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే.. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కొన్ని పాటలు మాత్రమే విడుదలైన శైలజా రెడ్డి అల్లుడిపై పెద్ద బజ్ లేదు కానీ.. పెద్ద బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా కాబట్టి కాస్త గ్రాండ్ గా విడుదల కావొచ్చు. ఇక యూ టర్న్ 2016లో వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ కు రీమేక్. అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. పవన్ కుమార్ దర్శకుడు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే హారర్ కథ ఇది. సమంతతో పాటు ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 

సో.. ఇప్పుడీ రెండు సినిమాలు సెప్టెంబర్ 13న ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.  బహుశా తెలుగు సినిమా హిస్టరీలోనే ఇది అరుదైన సంఘటన కావొచ్చు. మొగుడూ పెళ్లాం నటించిన వేర్వేరు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండటం అనేది నిజంగా రేరెస్ట్ ఇన్సిడెంట్. మరి ఈ భార్యాభర్తల వార్ లో విన్నర్ ఎవరవుతారో కానీ.. రెండూ డిఫరెంట్ జానర్ సినిమాలు. 

More Related Stories