English   

ఆ హీరో నన్ను గెలకలేదు

Hrithik Roshan Not Flirted Disha Patani
2018-08-29 20:28:16

ఆ హీరో నన్ను గెలకలేదు అంటోంది లోఫర్ బ్యూటీ దిశా పటాని. మరి ఆ హీరో ఎవరో తెలుసా.. హృతిక్ రోషన్. అసలే కొన్నాళ్లుగా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫూ కరెక్ట్ గా లేక నానా తంటాలు పడుతోన్న హృతిక్ పై కొత్త అభియోగాలు వచ్చాయి. వీటన్నిటికీ సెంటర్ పాయింట్ గా దిశా పటానీ ఉండటం విశేషం. అయితే గత కొన్నాళ్లుగా సాగుతోన్న ఈ తతంగంపై లేటెస్ట్ గా ఈ అమ్మడు ఓ ట్వీట్ చేసింది. ఇందులో హృతిక్ తప్పేం లేదనీ.. అతను నన్ను గెలకలేదని ట్వీట్ చేసింది. మరి ఈ గొడవ వెనక కథేంటీ..? అసలు హృతిక్ కు దిశాకు ఎప్పుడు ఎక్కడ పరిచయం అయింది.. ఎక్కడ చెడింది.. ఎలా చెడింది..?

కొన్నాళ్ల క్రితం హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో దిశాపటానీ హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. ఈ సినిమాలో దిశా బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ కూడా ఉన్నాడు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత ఈ మూవీ నుంచి దిశా తప్పుకుంది. అందుకు హృతిక్ రోషనే కారణం అంటూ కొన్ని మీడియాస్ నుంచి న్యూస్ వచ్చాయి. హృతిక్.. దిశాను ఇబ్బంది పెట్టాడనీ.. నో చెప్పినందుకు ఆమె కోసం రకరకాలుగా ప్రయత్నం చేశాడనీ.. ఇవన్నీ తట్టుకోలేకే దిశా ఆ సినిమా నుంచి తప్పుకుందని అప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కామన్ కాబట్టి అప్పుడెవరూ పట్టించుకోలేదు. కానీ ఓ మీడియా హౌస్ మాత్రం ఈ వ్యవహారానికి కాస్త మసాలా జోడించి ఈ మేటర్ కంగనా రనౌత్ తో గొడవ.. భార్యతో విడిపోవడం వంటివన్నీ రంగరించి హాట్ హాట్ గా ఓ ఆర్టికల్ వడ్డించింది. దీంతో హృతిక్ కు మండింది. ఆ మీడియాపై సీరియస్ అయ్యాడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లి కాస్త నెగెటివ్ సెన్స్ ను కరిగించుకోండి అని సలహాలిస్తూ పిచ్చి వేశాలేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇదంతా గత వారం రోజుల నుంచీ నడుస్తోన్న తతంగం. అయితే ఎటు తిరిగినా ఈ మేటర్ లో తనే సెంటర్ పాయింట్ గా ఉంది దిశా. అందుకే ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న ఈ పాప లేటెస్ట్ గా ట్విట్టర్ కెక్కింది.

‘నా గురించి హృతిక్ సర్ గురించి కొన్ని బాధ్యతారహితమైన, పిల్లాటల్లాంటి న్యూస్ వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ అబద్ధం. నాకు హృతిక్ సర్ తో మినిమం ఇంటరాక్షన్ కూడా లేదు. నేను చూసిన మంచి జెంటిల్మన్స్ లో ఆయన ఒకరు. అందుకే ఈ విషయంపై నేను స్పందిస్తున్నాను. అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి నేను బయటకు రావడానికి హృతిక్ సర్ కు సంబంధం లేదు’ అంటూ ఓ పేద్ద ట్వీట్ చేసింది. మరి ఈ  ట్వీట్ తో అయినా ఆ గొడవ ఆగుతుందేమో చూడాలి.

More Related Stories