English   

న‌ర్త‌న‌శాల ప్రివ్యూ.. కుర్రాడు కుమ్మేసేలా ఉన్నాడు..!

Narthanasala-Preview
2018-08-29 21:21:55

రెండు వారాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒక్క‌టే బొమ్మ ఉంది. అదే గీత‌గోవిందం.. ఇప్ప‌టికీ ఈ చిత్ర దూకుడు సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర జోరుకు బ్రేకులు వేయ‌డానికి నాగ‌శౌర్య వ‌చ్చేస్తున్నాడు. ఈయ‌న న‌టించిన న‌ర్త‌న‌శాల విడుద‌ల‌వుతుందిప్పుడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500 స్క్రీన్స్ లో.. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో 144 లొకేష‌న్స్ లో విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం. ఆగ‌స్ట్ 29 రాత్రి నుంచే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. 2 గంట‌ల 18 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. అయితే ఆగ‌స్ట్ 30న హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు ఉన్న కార‌ణంగా తొలిరోజు వ‌సూళ్ల‌పై ఏదైనా ప్ర‌భావం ప‌డుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి నిర్మాత‌లు. 

ఛ‌లో త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. నాగ‌శౌర్య సినిమాల‌కు ఇదివ‌ర‌కు ఉన్న మార్కెట్ కంటే ఇప్పుడు ఎక్కువ‌గా ఉంది. ఛ‌లో 12 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. దాంతో ఇప్పుడు న‌ర్త‌న‌శాల‌పై అవే అంచ‌నాలు క్యారీ అవుతున్నాయి. పైగా ప్రోమోస్ కూడా అదిరిపోతున్నాయి. ఇది కూడా కొత్త ద‌ర్శ‌కుడే తెర‌కెక్కించ‌డం విశేషం. ఇందులో గే గా న‌టించాడు నాగ‌శౌర్య‌. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని పాట‌లు కూడా బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి.ముఖ్యంగా యామిని భాస్క‌ర్ తో వ‌చ్చే బీచ్ సాంగ్ హీట్ ఎక్కిస్తుంది. అస‌లు యామిని అనే ఓ హీరోయిన్ ఉంద‌నే విష‌యాన్నే మ‌నోళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ న‌ర్త‌న‌శాల విడుదల త‌ర్వాత ఈ భామ‌కు పేరు రావ‌డం మాత్రం ఖాయం. శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు మ‌రో విజ‌యాన్ని ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు నాగ‌శౌర్య‌.

More Related Stories