English   

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఎన్టీవీ వార్షికోత్స‌వ వేడుక‌లు ర‌ద్దు

Ntv Anniversary Celebrations Cancelled due to Harikrishna Death
2018-08-30 06:17:33

సినీ న‌టుడు.. రాజకీయ ప్ర‌ముఖుడు నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణించ‌డంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌తో పాటు యావత్ తెలుగు ప్ర‌జ‌లు విషాదంలో మునిగిపోయారు. ఆయ‌న జ్ఞాపకాల‌ను త‌లుచుకుంటూ క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈయ‌న స్మ‌ర‌ణలోనే ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఎన్టీవీ త‌మ‌ వార్షికోత్స‌వ వేడుక‌లు సైతం ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాదు.. ర‌చ‌న టెలివిజ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులంతా హ‌రికృష్ణ‌కు నివాళి అర్పించారు. ఆగ‌స్ట్ 30న ఎన్టీవీ 11వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని భారీ ఎత్తున వేడుక‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు సంస్థ అధినేత నరేంద్ర చౌద‌రి. కానీ అనుకోని విధంగా హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఎలాంటి వేడుక‌లు ఉండ‌వ‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది ఎన్టీవీ సంస్థ‌. వీళ్లు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఉద్యోగుల‌తో పాటు బ‌య‌ట నంద‌మూరి అభిమానులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసారు.

More Related Stories