English   

హ‌రికృష్ణ మ‌ర‌ణం వాళ్ల‌కు షాకిచ్చిందిగా..!

Harikrishna Nandamuri Death Tollywood Shocked
2018-08-30 10:12:46

హ‌రికృష్ణ మ‌ర‌ణం తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటే. నిన్న‌టి వ‌ర‌కు నిక్షేపంగా ఉన్న మ‌నిషి.. 24 గంట‌ల్లోనే నిర్జీవంగా ప‌డిపోతే ఎవ‌రైనా క‌న్నీరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈయ‌న మ‌ర‌ణంతో టాలీవుడ్ కూడా ఇదే చేస్తుంది. హ‌రికృష్ణ మ‌ర‌ణంపై తెలుగు ప‌రిశ్ర‌మ మాత్ర‌మే కాదు.. త‌మిళ‌నాట కూడా సంతాపాలు వ‌చ్చాయి. ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్లు.. సాన్నిహిత్యం ఉన్న‌వాళ్లంతా హ‌రికృష్ణ మ‌ర‌ణంపై బాధ వ్య‌క్తం చేసారు. ఆయ‌న‌తో త‌మ‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఆగ‌స్ట్ 29 తెలుగు ఇండ‌స్ట్రీకి బ్లాక్ డేగా మారిపోయింది. ఆ రోజు రావాల్సిన సినిమాలు.. చేయాల్సిన ప‌నులు అన్నీ ఆగిపోయాయి.

ఆగ‌స్ట్ 29న నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు ట్రైల‌ర్ రావాల్సింది.. రాలేదు. ఇక ఇదే రోజు విశాల్ పందెంకోడి 2 టీజ‌ర్ రావాల్సింది.. అదీ రాలేదు. దేవ‌దాస్ చిత్రంలోని తొలిపాట కూడా ఇదే రోజు విడుద‌ల కావాల్సింది. దాన్ని కూడా వాయిదా వేసారు. అన్నింటికీ ఒక్క‌టే కార‌ణం.. హ‌రికృష్ణ మ‌ర‌ణం. అంద‌రితోనూ ఈయ‌న‌కు ఉన్న సాన్నిహిత్యంకు తోడు ఎన్టీఆర్ తో స్నేహం కూడా అంద‌రి మ‌న‌సుల‌ను క‌లిచివేసింది. దాంతో త‌మ సినిమాల ప‌నుల‌న్నీ ప‌క్క‌న‌బెట్టి కేవ‌లం హ‌రికృష్ణ ఇంటివైపు ప‌రుగులు తీసారంతా. ఆగ‌స్ట్ 30న ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు కూడా ఇండ‌స్ట్రీ అంతా మూకుమ్మ‌డిగా వ‌చ్చేలా క‌నిపిస్తుంది. మొత్తానికి హ‌రికృష్ణ మ‌ర‌ణం కొంద‌రికి మాత్రం షాక్ ఇచ్చింది. ప‌ర్స‌న‌ల్ గా కాదు.. ప్రొఫెషన‌ల్ గా..!

More Related Stories