English   

పవన్ కళ్యాణ్ బర్త్ డేకు రామ్ చరణ్ గిఫ్ట్

Ram-charan
2018-08-30 12:52:58

బాబాయ్ బర్త్ డే రోజు అబ్బాయ్ ఓ అదిరిపోయే గిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇది మెగా ఫ్యాన్స్ కు సరికొత్త జోష్ ను ఇవ్వబోతోందనే వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఈ బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బర్త్ డేకు కామన్ డిపి అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించే సరికి అందరి అటెన్షన్ ఆ వైపుకు వెళ్లింది. 

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ ఓ ఓ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమాలో భరత్ అనేనేను భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇంత వరకూ ఏ వార్తలూ రాలేదు. అంటే సినిమా జానర్ కానీ.. చరణ్ లుక్ కానీ.. టైటిల్ కానీ తేలలేదు. సో.. ఇప్పుడా విషయాన్నే పవన్ కళ్యాణ్ బర్త్ డే ను వేదికగా చేసుకుని రామ్ చరణ్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. 

సెప్టెంబర్ 2న తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లక్ పోస్టర్ ను రామ్ చరణ్ విడుదల చేయబోతున్నాడట. ఈ పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఏ జానర్ లో ఉంటుందో అంచనా వేయొచ్చనేవారూ ఉన్నారు. ఇక ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ అవుతుందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ బర్త్ డే రోజున రామ్ చరణ్ ఇచ్చే గిఫ్ట్ మాత్రం మెగా ఫ్యాన్స్ జోష్ నింపుతుందనే చెప్పాలి. 

More Related Stories