English   

న‌ర్త‌న‌శాల‌ రివ్యూ

Narthanasala-Review
2018-08-30 06:21:00

ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నాగ‌శౌర్య నుంచి వ‌చ్చిన సినిమా అంటే క‌చ్చితంగా అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పైగా నర్త‌న‌శాల గురించి చాలా గొప్ప‌గా చెప్పాడు శౌర్య‌. న‌చ్చితేనే చూడండి.. లేక‌పోతే అవ‌స‌రం లేద‌న్నాడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని సినిమా నిజంగానే నిల‌బెట్టిందా..? 

క‌థ‌:

క‌ళామందిర్ క‌ళ్యాణ్ (శివాజీరాజా) క్లోత్ షోరూం ఉంటుంది. ఈయ‌న అమ్మ చ‌నిపోవ‌డంతో మ‌ళ్లీ త‌న క‌డుపున పుడుతుంది అనుకుంటాడు. కానీ అబ్బాయి(నాగ‌శౌర్య‌) పుట్టేస్తాడు. అమ్మాయి పుట్ట‌లేద‌ని తెలిస్తే తండ్రి చ‌చ్చిపోతాడేమో అని అమ్మాయిలాగే శౌర్య‌ను పెంచుతాడు. శౌర్య కూడా పెళ్లంటే ఫీలింగ్స్ లేవంటూ తిరుగుతుంటాడు. ఇలాంటి కుర్రాడి జీవితంలోకి మాన‌స‌(కాష్మీర్ ప‌ర్దేశీ) వ‌స్తుంది. ఈమెను చూడ‌గానే హీరో కూడా ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ అదే స‌మ‌యంలో స‌త్య‌(యామిని భాస్క‌ర్) కూడా శౌర్య‌ను ఇష్ట‌ప‌డుతుంది. దాంతో ఆమె నుంచి త‌ప్పించుకోడానికి గే అనే అబ‌ద్ధం ఆడ‌తాడు శౌర్య. అప్ప‌ట్నుంచి ఏం జ‌రుగుతుంది.. ఎలా హీరో అది కాదు అని నిరూపించుకుంటాడు అనేది క‌థ‌.. 

క‌థ‌నం:

న‌ర్త‌న‌శాల అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా అంద‌రికీ గుర్తొచ్చేది అదే. బృహ‌న్న‌ల‌గా హీరో మారిపోవ‌డం.. గే కామెడీ ఉండ‌టం ఎక్స్ పెక్ట్ చేస్తారు. నాగ‌శౌర్య‌కు కూడా క‌థ బాగా న‌చ్చి ఈ టైటిల్ ఓకే చేయించుకున్నాడు. కానీ క‌థ‌లో ఉన్న కొత్త‌ద‌నం క‌థ‌నంలో లేక‌పోయేస‌రికి ఈ సినిమా ఎటూ కాకుండా పోయింది. ముఖ్యంగా ఓ దారితెన్నూ లేని క‌థ‌నంతో పిచ్చిపిచ్చిగా తిప్పేసాడు ద‌ర్శ‌కుడు. పైగా క‌ట్ షాట్ల‌తో చంపేసాడు. ఓ సీన్ న‌డుస్తుండ‌గానే స‌డ‌న్ గా క‌ట్ చేసి మ‌రో సీన్ వేస్తాడు. ఫ‌స్టాఫ్ లో అలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. ఎపిసోడ్లు చూసిన‌ట్లుగా సీరియ‌ల్ మాదిరి సాగిపోతుంటుంది సినిమా. ఛ‌లోలో ఉన్న కామెడీలో క‌నీసం స‌గం కూడా ఇందులో క‌నిపించ‌లేదు. ఫ‌స్టాఫ్ అంతా ఏదో అలా గ‌డిపేసిన ద‌ర్శ‌కుడు.. సెకండాఫ్ లో శీనువైట్ల త‌ర‌హాలో ఒకే ఇంట్లో తిష్ట వేయించాడు క‌థ‌ను. అక్క‌డు మ‌లుపులు తిప్పుతూ రింగురోడ్డులో బండిలా యు ట‌ర్న్ కొడుతూనే ఉన్నాడు కానీ గ‌మ్యం మాత్రం చేర‌లేదు. హీరో హీరోయిన్ ల‌వ్ ట్రాక్ లేదు.. సెకండ్ హీరోయిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ లో ఫైట్ ఎందుకు వ‌స్తుందో తెలియ‌దు.. అస‌లు సెకండాఫ్ మొద‌లైన త‌ర్వాత క‌థ‌లో అంత సీరియ‌స్ నెస్ లేకుండా ద‌ర్శ‌కుడు ఎందుకు వ‌దిలేసాడో తెలియ‌దు. మొత్తానికి ఛ‌లో లాంటి సినిమా త‌ర్వాత ఇలాంటి క‌థ‌ను నాగ‌శౌర్య ఎందుకు న‌మ్మాడో అర్థం కాదు. ఓవ‌రాల్ గా నర్త‌న‌శాల శౌర్య న‌మ్మ‌కాన్ని చంపేసింది. 

న‌టీన‌టులు:

నాగ‌శౌర్య ఇలాంటి గే పాత్ర‌లో న‌టించ‌డం కొత్త విష‌య‌మే. క‌థ‌లో ఇదే యూనిక్ పాయింట్ అని ఓకే చేసాడేమో మ‌రి. అయితే ఆ సీన్స్ త‌ప్పిస్తే మిగిలిన వాటిలో బాగానే న‌టించాడు. హీరోయిన్లు కాష్మీర్ ప‌ర్దేశీ, యామిని భాస్క‌ర్ ల‌కు క‌థ‌లో పెద్ద‌గా ఇంపార్టెన్స్ అయితే లేదు. అజ‌య్ గే గా బాగా చేసాడు. కానీ అత‌డికి పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, శివాజీరాజా కామెడీని బాగానే మోసారు. కానీ క‌థ ఉన్న ప‌ల‌చ‌ద‌నానికి వాళ్ల కామెడీ స‌రిపోలేదు. హీరో ఫ్రెండ్ కూడా బాగానే చేసాడు. 

టెక్నిక‌ల్ టీం:

మ‌హ‌త్ సాగ‌ర్ ఛ‌లోకు చేసిన మాయ మ‌ళ్లీ చేయ‌లేక‌పోయాడు. ఆ సినిమాలో పాట‌లు సూప‌ర్ హిట్. కానీ న‌ర్త‌న‌శాల‌లో అలాంటి పాట ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్రేమంటే ఇంతేలే పాట కాస్త బెట‌ర్. సాయిశ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ బాగుంది. విజువ‌ల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ వీక్ అనిపించింది. ఫ‌స్టాఫ్ లో చాలా సీన్స్ బోర్ కొట్టించాయి. ఐరా క్రియేష‌న్స్ నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశం మిస్ చేసుకున్నాడు. నాగ‌శౌర్య న‌మ్మ‌కం నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

చివ‌ర‌గా: న‌ర్తన‌శాల‌.. పెద్ద పొత్రం సినిమా..!

రేటింగ్: 2.5/5 

More Related Stories