English   

కుర్రాళ్లకు వణుకు పుట్టిస్తోన్న విజయ్ దేవరకొండ 

Vijay-Deverakonda
2018-08-30 10:01:54

విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటే ఇప్పుడు ప్రేక్షకులు ఎంత చప్పట్లు కొడుతున్నారో ఇండస్ట్రీలోని కొందరు కుర్రాళ్లు అంత ఉలిక్కి పడుతున్నారు. ఏకులా వచ్చి మేకులా మారాడని చాలామంది యంగ్ స్టర్స్ ఫీలవుతున్నారట. కారణం.. అతని లేటెస్ట్ సక్సెస్. ఇది మాత్రమే కాదు. అతని టాలెంట్ కూడా. అవును.. తొలి సినిమాకే మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు విజయ్. తర్వాత అర్జున్ రెడ్డితో ఎంటైర్ ఇండస్ట్రీని ఫ్లాట్ చేశాడు. అతని మాయలో పడని స్టార్ లేడంటే అతిశయోక్తి కాదు. మహేష్ బాబు నుంచి మినీ స్టార్ వరకూ అర్జున్ రెడ్డి పాత్రకు ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి అంటే విజయ్. అతనికి పర్యాయపదంగా మారిపోయిన సినిమా అది. అంతలా ఆ సినిమాతో ఆకట్టుకున్న విజయ్ కి అనూహ్యంగా ఓవర్శీస్ నుంచి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. అయితే ఇలాంటి ‘సింగిల్ మూవీ క్రేజ్’ లు ఇండస్ట్రీలో మామూలే. అవి నెక్ట్స్ సినిమా వరకూ ఉన్నా.. కెరీర్ అంతా కంటిన్యూ కావు. 

కానీ విజయ్ దేవరకొండ విషయంలో కెరీర్ అంతా చెప్పుకునేలా ఆ హిట్ నెక్ట్స్ మూవీకి అనూహ్యమైన రేంజ్ ను ఇచ్చింది. అవును.. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి అనే ఫేమ్ ను మరచిపోయేలా గీత గోవిందంలో అద్భుతమైన నటనతో మరోసారి పరిశ్రమను ఆశ్చర్యపరిచాడు. గీత గోవిందం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్లబ్ లో ఎంటర్ అవుతామని ఇప్పటికే పదేళ్లుగా పరిశ్రమలో ఉన్న యంగ్ స్టర్స్ ఊహించి కూడా ఉండరు. కానీ విజయ్ ఆ ఫీట్ ను అతి తక్కువ టైమ్ లో సాధించాడు. టాలీవుడ్ కు నయా సూపర్ స్టార్ గా మారాడు. ఇదే ఇప్పుడు కుర్ర హీరోల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇక తమ రేంజ్ విజయ్ తర్వాతే అని వారంతా తెగ ఫీలవుతున్నారట.

గీత గోవిందంకు ముందు విజయ్ దేవరకొండ రేంజ్ మహా అయితే కోటి రూపాయలు(ఈ మూవీకి కేవలం 50లక్షల రెమ్యూనరేషనే అని టాక్.. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాకపోవడం వల్ల). కానీ ఇప్పుడు అతను అడిగితే పది కోట్లైనా ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతెందుకు అల్లు అరవిందే 5కోట్లకు పైన ఆఫర్ చేశాడట. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిగర్స్ ను బట్టి ఇక పై టాలీవుడ్ నంబర్ గేమ్ లో కొత్త నంబర్ యాడ్ అయినట్టే అనుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూణ్నాలుగు సినిమాలున్నాయి. ఇవన్నీ కథా బలం ఉన్న సినిమాలే అని టైటిల్స్ ను బట్టే తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా అతను మరిన్ని విజయాలు సాధించబోతున్నాడనుకోవచ్చు. 

ఇక విజయ్ ఎదుగుదల చూసి ఇప్పటి వరకూ యంగ్ స్టర్స్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాం అనుకుంటోన్న నాని, నితిన్, శర్వానంద్, నాగ చైతన్య, నిఖిల్ వంటి స్టార్స్ జెలసీగానే ఫీలవుతున్నారని వేరే చెప్పక్కర్లేదు. వీరిలో నితిన్ మాత్రమే కాస్త ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న హీరో. అది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చి అ ఆ సినిమాతో. సో ఆ క్రెడిట్ పూర్తిగా అతనికే ఇవ్వలేం. కానీ విజయ్ దేవరకొండ విషయంలో అలా కాదు. ఈ సినిమా క్రేజ్ లో మేజర్ షేర్ అతనిదే. దర్శకుడు పరశురాం కూడా ఈ ఫిగర్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అల్లు అరవింద్ కు సైతం ఇది కలలో కూడా ఊహించని సర్ ప్రైజ్. అలాగని ఇదేమీ అసాధారణమైన కథ కాదు. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ. అయినా ఈ స్థాయి కలెక్షన్స్ అంటే అదంతా విజయ్ మహిమే. మొత్తంగా టాలీవుడ్ లో ఇప్పుడు కుర్ర హీరోలంతా విజయ్ ఫేమ్ ను టాలెంట్ ను చూసి కుళ్లుకుంటున్నారనేది నిజం. మరి ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అతను ఖచ్చితంగా టాప్ స్టార్స్ లీగ్ లోకీ ఈజీగా ఎంటర్ అయిపోతాడు. ఆ ఛరిష్మా.. ఖలేజా అతనికి ఉన్నాయి.. కాదంటారా..?

More Related Stories