English   

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు వద్దన్నారు..?

NTR-Kalyan-Ram
2018-08-30 18:49:26

హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. సినిమా, రాజకీయ ప్రముఖులతో పాటు అశేష అభిమానుల మధ్య తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. అయితే ఈ మధ్యలో కొంత ఇంట్రెస్టింగ్ డ్రామా నడిచింది. అది ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి చంద్రబాబుకు ఎదురు తిరిగిన కథ. అవును.. మీరు చదివింది కరెక్టే. ఇంత విషాదంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు చంద్రబాబుకు షాక్ ఇచ్చినంత పనిచేశారు. దీని వెనక అన్నదమ్ములిద్దరూ ఒకే మాటగా ఉన్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం.. ఇలాంటి సందర్బంలోనూ పలువురు పెద్దలు చర్చించుకుంటున్నారు.

హరికృష్ణ మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తో పాటు మరో బామ్మర్ది బాలయ్యతో కలిసి నార్కట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ కు వచ్చాడు. అప్పటి నుంచి అంత్యక్రియలు ముగిసేవరకూ దాదాపు హరికృష్ణ ఇంటి వద్దే ఉన్నారు. మధ్యలో ఒకటీ రెండు గంటలకు మినహా ప్రభుత్వ కార్యక్రమాలేవీ పట్టించుకోలేదు. అయితే హరికృష్ణ దహన క్రియల రోజున ఉదయం 9-10 గంటల ప్రాంతంలో ఆయన శవాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్దకు తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. అక్కడ పార్టీ శ్రేణులు, అభిమానులు చివరి నివాళి అర్పించే విధంగా చూడాలన్నారు. కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఈ అన్నదమ్ములిద్దరూ వ్యతిరేకించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నాన్న శవాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు వీలు లేదని ఖచ్చితంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఈ చర్చను పొడిగించలేదు. 

కానీ ఆ ఇద్దరూ ఈ సమయంలో ఇలా చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ తాత పార్టీలో తండ్రికి అవమానాలు జరిగాయనే కోపం ఆ ఇద్దరిలోనూ ఉందనే విషయం ఈ సందర్భంగా బయటపడిందనే గుసగుసలు వినిపించాయి. చంద్రబాబు నేతృత్వంలో తండ్రికి ఎన్ని అవమానాలు జరిగాయో అందరికీ తెలిసినా తెలియకపోయినా కొడుకులకైతే తెలుసు కదా.. ఆ విషయాలు దృష్టిలో ఉంచుకునే ఆయన శవాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకువెళతామంటే ఒద్దన్నారని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ నిర్ణయం తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ములు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారా లేదా అనే అనుమానాలకూ తావిస్తోంది. కొన్ని విషయాలు అసందర్భం అయితే కావొచ్చు.. కానీ అసత్యం అయితే కావు.. అదే ఇప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తున్నాయి. 

More Related Stories