English   

జీనియస్ కుర్రాడి రాసలీలల టీజర్

Actor Havish Tamil Movie 7 Official Teaser Released
2018-08-30 18:54:20

తెలుగులో నువ్విలా, రామ్ లీలా, జీనియస్ వంటి సినిమాలు చేసిన కుర్రాడు గుర్తున్నాడా..? యస్ అతనే పేరు హవీష్. ఆతని తండ్రి ఓ విద్యాసంస్థల వ్యాపారి. తనయుడు హీరో కావాలనే కోరికను ఆయన నెరవేర్చాడు. కానీ ఇతనే సక్సెస్ కాలేకపోయాడు. కంటిన్యూస్ గా కొన్ని  సినిమాలు చేసినా అన్నీ పోయాయి. చిన్ని కృష్ణ కథతో ఓమ్ కార్ డైరెక్షన్ లో చేసిన జీనియస్ గురించి ఓ ఊదరగొట్టారు. తీరా సినిమా చూస్తే అందులో ఏమీ లేదని తేలిపోయింది. దీంతో కుర్రాడు తెలుగువారిపై కోపం తెచ్చుకున్నట్టున్నాడు. అందుకే కనిపించిన ప్రతి అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని తెగ రాసలీలలు సాగిస్తున్నాడు. మరి ఇలా చేస్తే ప్రతి అమ్మాయి చూస్తూ ఊరుకోదు కదా.. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు. చేశారు కూడా. అందుకే పోలీస్ లు ఈ కుర్రాడి కోసం అన్వేషిస్తున్నారు. ఎంతలా అంటే కనిపిస్తే కాల్చివేసేంత.

ఏంటీ ఇదంతా నిజమే అనుకుంటున్నారా..? నిజమే.. కానీ రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అవును.. హవీష్ కు తెలుగు పెద్దగా కలిసిరాలేదని తమిళ్ కు వెళ్లాడు. అక్కడ ‘‘7’’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మనోడు ప్లే బాయ్ తరహా పాత్ర చేస్తున్నాడు. లేటెస్ట్ గా  మూవీ టీజర్ విడుదలైంది. రకరకాల అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకునే కుర్రాడు. అతని కథ తెలిసిన అమ్మాయిలు పోలీస్ లకు కంప్లైంట్ చేస్తారు. దీంతో వారు రంగంలోకి దిగుతారు. అతనెవరు..? ఎందుకిలా చేస్తున్నాడు..? దీని వెనక ఉద్దేశ్యమేంటీ అనే ఆరాలు మొదలుపెట్టారు. అన్నీ తెలుసుకున్న తర్వాత అతన్ని చంపడానికి కూడా సిద్ధపడ్డట్టున్నారు.

ఇక హవీష్ తో పాటు ఈ మూవీలో రెజీనా, నందిత, అనీషా ఆంబ్రోస్ వంటి బ్యూటీస్ నటిస్తున్నారు. తెలుగులో రఘుగా ఒకప్పుడు ఫేమస్ యాక్టర్ గా పేరున్న రహమాన్ మరోసారి కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నిజర్ షఫీ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ జీనియస్ కుర్రాడికి ఈ తమిళ రాసలీలలు ఎలా కలిసొస్తాయో చూడాలి.

More Related Stories