English   

వామ్మో నోటానే ముందొస్తుందా ఏంటి..? 

Vijay-Devarakonda
2018-08-30 19:16:19

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలంటే ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డ లేని పిచ్చి. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే సంచ‌ల‌నాలు వ‌స్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకో తెలియ‌దు కానీ ట్యాక్సీవాలాపై మాత్రం ఇలాంటి ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ సినిమాను కావాల‌నే నానాటికి ఆల‌స్యం చేస్తున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ద్విభాషా చిత్రంగా న‌టిస్తున్న నోటాను ముందు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఈ చిత్రం క్రిస్ మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. 

ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజ‌కీయ నాయ‌కులు చేసే అన్యాయాల‌పై పోరాడే యువ‌కుడిగా న‌టిస్తున్నాడు విజ‌య్. ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అవుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టి వ‌ర‌కు బై లింగువ‌ల్ సినిమాతో హిట్ కొట్టిన హీరో అయితే తెలుగులో లేడు. ఇప్పుడు ఈ రికార్డుకు విజ‌య్ చెక్ పెట్టాల‌ని చూస్తున్నాడు. నాగార్జున ఊపిరితో విజ‌యం అందుకున్నా అందులో కార్తి కూడా ఉన్నాడు. దాంతో సోలోగా ఈ ఫీట్ చేయాల‌ని చూస్తున్నాడు విజ‌య్. ట్యాక్సీవాలా కానీ ఇంకా నెల రోజులు కానీ రాలేదంటే దాన్ని ఎలాగోలా వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసి.. ముందు నోటాను విడుద‌ల చేస్తారు. మ‌రి చూడాలిక‌.. ఈ నాట‌కం నోటా వైపు ఎలా తిర‌గ‌నుందో..?

More Related Stories