English   

యాత్రకు సమరశంఖం పూరిస్తున్నారు..

Yatra-movie
2018-08-30 21:13:11

తెలుగులో బయోపిక్స్ కు మంచి క్రేజ్ ఉందిప్పుడు. మహానటి సూపర్ హిట్ కావడంతో ఇక వీటికి మరింత డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఎన్టీఆర్ పై ఎన్టీఆర్ పేరుతో బాలయ్య ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఇదే టైమ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కూడా తెరపైకి వచ్చింది. చాలా త్వరగా ఈ సినిమా సెట్స్ పైకి రావడం విశేషం. మళయాల మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీకీ మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో పాఠశాల, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణంతో రూపొందుతోన్న యాత్ర నుంచి  “కడప దాటి ప్రతీ గడప లోకి వస్తున్నాను. మీతో కలసి నడవాలనుంది మీ గుండె చప్పుడు వినాలనుంది’’ అంటూ వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది టీమ్. సెప్టెంబర్ 2.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు. ఆయన జయంతి రోజున ఈ మూవీ నుంచి ఓ రిలికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ‘‘కే’’ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి వచ్చే ఆ పాట సమరశంఖం అంటూ సాగుతుందని సమాచారం. మొత్తంగా తమిళ్ స్టార్ హీరో కార్తీ వైఎస్ జగన్ గా నటిస్తోన్న ఈ మూవీలో పోసాని, రావు రమేష్, అనసూయ, శరణ్య పొన్ వన్నన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదల చేయాలనే సంకల్పంతో సినిమా తెరకెక్కిస్తున్నారు.

More Related Stories