English   

మహానటి .. మరొకటి

Record-TRP-For- Mahanati
2018-08-30 22:09:20

మహానటి.. ఏ ముహూర్తంలో మొదలైందో కానీ ఈ సినిమా.. ఆరంభం నుంచి విడుదల వరకూ అన్నీ సంచలనాలే. అచ్చంగా ఆ మహానటి సావిత్రిని కీర్తి సురేష్ అభినయిస్తే.. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఈ తరానికి ఆ మహానటి జీవితాన్ని సాక్షాత్కరింప చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతం అన్నమాట సంపాదించిన మహానటి.. కలెక్షన్స్ లోనూ సత్తా చాటింది. అతిరథులైన నటుల కలయికలో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓ ప్రత్యేకమైన ముద్రను వేసింది. అలాగే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లోనూ అప్లాజ్ లు అందుకుంది మహానటి. అయితే వెండితెరపైనే కాదు.. మహానటి ప్రభంజనం బుల్లితెరపైనా కనిపించడం విశేషం.  కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన మహానటి గత వారం స్టార్ మా టివిలో ప్రదర్శితమైంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకు 20. 16 టిఆర్పీ రావడం విశేషం. ఓ మహిళా ప్రధానమైన సినిమాకు ఈ స్థాయిలో టిఆర్పీ రావడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాలో ఎంతో విషయం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. వెండితెరపై ప్రభంజనం సృష్టించిన.. ఈ మూవీ ఆబాల గోపాలానికీ నచ్చింది. అందుకే అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతోంది. అంటే బాహుబలి, జనతా గ్యారేజ్ తర్వాతి స్థానం ఈ సినిమాదే అన్నమాట.. అంటే మహానటి సిగలో మరొక గౌరవం చేరిందన్నమాట.

More Related Stories