English   

ద‌ర్శ‌కురాలు బి జ‌య క‌న్నుమూత‌

Director B Jaya Passes A Way
2018-08-31 05:59:21

తెలుగు ఇండ‌స్ట్రీ ఇంకా నంద‌మూరి హ‌రికృష్ణ పోయిన బాధ‌లోంచి బ‌య‌టికి రాలేదు అప్పుడే మ‌రో వార్త వినాల్సి వ‌చ్చింది. ప్ర‌ముఖ నిర్మాత‌.. లీడింగ్ పిఆర్ఓ బిఏ రాజు స‌తీమ‌ణి.. ద‌ర్శ‌కురాలు బి జ‌య క‌న్నుమూసారు. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆగ‌స్ట్ 30 రాత్రి హైద‌రాబాద్ లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు జ‌య‌. ఈమె మృతి ప‌ట్ల సినిమా ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసారు. క‌ళ్ల‌ముందు తిరిగిన వ్య‌క్తి ఇంత ఆక‌స్మికంగా క‌న్నుమూయ‌డం మాత్రం షాకే. ఎమ్ఏ సైకాల‌జీ చ‌దివిన జ‌య‌.. ఓ న్యూస్ పేప‌ర్ లో జ‌ర్న‌లిస్ట్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసారు. 2003లో బాలాదిత్య హీరోగా వ‌చ్చిన చంటిగాడు సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు. ఆ త‌ర్వాత గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు.. ప్రేమికులు.. ల‌వ్లీ లాంటి సినిమాల‌తో ద‌ర్శ‌కురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెర‌కెక్కించిన చివ‌రి సినిమా వైశాఖం 2017లో విడుద‌లైంది.

More Related Stories