English   

కమల్ హాసన్... విక్రమ్ తో స్టార్ట్ చేసాడు

Kamal Haasan Doing a Movie With Chiyaan Vikram
2018-08-31 07:05:38

కమల్ హాసన్.. ఎంత పెద్ద స్టార్ అనేది వేరే చెప్పక్కర్లేదు. అలాగే ఆయన గొప్ప టెక్నీషియన్, దర్శకుడు కూడా. అంతకు మించి మంచి నిర్మాత కూడా. తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అనేక చిత్రాలు నిర్మించారు. తన అన్న చారు హాసన్ ఈ ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు చూసేవారు. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యానర్ నుంచి(విశ్వరూపం మినహా) సినిమాలు పెద్దగా రావడం లేదు. అయితే అనూహ్యంగా కమల్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యానర్ లో సినిమా నిర్మిస్తూ విక్రమ్ ను హీరోగా తీసుకున్నాడు. ఇద్దరూ నటనలో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. అలాంటి ఇద్దరి కలయికలో సినిమా వస్తోందంటే అభిమానులకు అంతకు మించిన పండగ ఇంకేముంటుందీ.. కాకపోతే ఈ మేటర్ లో చిన్న డిజప్పాయింట్ మెంట్ ఉంది.

తన బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమాకు కమల్ హాసన్ కేవలం నిర్మాత. అంటే తను నటించడం లేదు. సో.. చాలామంది అనుకుంటున్నట్టు ఇది మల్టీస్టారర్ కాదన్నమాట. ఇక తనతో చీకటి రాజ్యం అనే సినిమా డైరెక్ట్ చేసిన రాజేష్ ఎమ్ సెల్వకు మరోసారి దర్శకుడుగా ఛాన్స్ ఇచ్చాడు కమల్. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మూవీలో కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంటే తండ్రి ప్రొడక్షన్ లో విక్రమ్ సరసన హీరోయిన్ గా నటిస్తోందన్నమాట. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరుపుకుంది. మరి ఇదే జానర్ లో వస్తోన్న సినిమా.. విక్రమ్ స్టైల్ లో ఉంటుందా లేక కమల్ స్టైల్ లో ఉంటుందా అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

More Related Stories