English   

తమ్ముడి దగ్గరికి వెళ్లనున్న మహేష్

Mahesh Babu Coming Back to India For Mourn NTR and BA Raju
2018-08-31 09:15:48

ఈ మ‌ధ్య మ‌న హీరోల మ‌ధ్య రిలేష‌న్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్.. మ‌హేష్ అంటే ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేక పోతున్నారు. అన్న‌య్య అంటూ నోరారా మ‌హేష్ ను పిలుస్తాడు జూనియ‌ర్. అలాంటి ఎన్టీఆర్ కు క‌ష్ట‌మొచ్చిన టైమ్ లో ప‌క్క‌న నిల‌బ‌డ‌క‌పోతే ఎలా చెప్పండి..? అందుకే ఇప్పుడు అదే చేస్తున్నాడు మ‌హేష్ బాబు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ అంతా హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ఎన్టీఆర్ కు తోడుగా ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్.. మ‌నోజ్ లాంటి వాళ్లైతే ఆయ‌న‌తోనే ఉంటూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు మ‌హేష్ కూడా వ‌స్తున్నాడు. మ‌హ‌ర్షి షూటింగ్ లో కాస్త టైమ్ దొర‌క‌డంతో ఎప్ప‌ట్లాగే ఈయ‌న ఫ్యామిలీతో పాటు టూర్ వెళ్లాడు ఈ హీరో. అక్క‌డ ఉన్న‌పుడు హ‌రికృష్ణ విష‌యం తెలిసింది. అయితే అనివార్య కార‌ణాల‌తో వెంట‌నే రాలేక‌పోయాడు ఈ సూప‌ర్ స్టార్. ఆగ‌స్ట్ 31న ఈయ‌న ఇండియాకు వ‌స్తున్నాడు. వ‌చ్చీ రాగానే ముందు ఎన్టీఆర్ ను క‌లిసి ఓదార్చ‌నున్నాడు సూప‌ర్ స్టార్. ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాత బిఏ రాజు ఇంటికి వెళ్ల‌నున్నారు. ఈయ‌న భార్య.. ద‌ర్శ‌కురాలు బి జ‌య ఆగ‌స్ట్ 30 రాత్రి ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. అస‌లే బిఏ రాజు కుటుంబానికి మ‌హేష్ అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న్ని ఎత్తుకుని పెంచిన వాళ్ల‌లో రాజుగారు కూడా ఉంటారు. అందుకే ఆయ‌న కుటుంబాన్ని కూడా ఓదార్చ‌నున్నాడు మ‌హేష్ బాబు. మొత్తానికి హ‌రికృష్ణ మ‌ర‌ణం విష‌యం తెలిసిన వెంట‌నే నా సోద‌రుడికి దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ట్వీట్ చేసాడు మ‌హేష్. కానీ మ‌నిషి నేరుగా వ‌చ్చి చెప్పే ధైర్యం మ‌రోలా ఉంటుంది క‌దా.. ఇదే చేస్తున్నాడు ఇప్పుడు మ‌న సూప‌ర్ స్టార్.

More Related Stories