English   

ఎన్టీఆర్... నేను వస్తాను మీరు ఆపొద్దు

Jr NTR Will Participate Aravindha Sametha Shoot
2018-08-31 10:04:47

హ‌రికృష్ణ హఠాన్మ‌ర‌ణంతో ఎన్టీఆర్ డీప్ షాక్ లోకి వెళ్లిపోయాడు ఎన్టీఆర్. అన్నీ తానే అనుకున్న తండ్రి అలా ఒంట‌రిగా వ‌దిలేసి వెళ్లిపోవ‌డంతో నంద‌మూరి హీరోకు ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే అన్న‌ను కోల్పోయిన ఎన్టీఆర్ కు.. ఇప్పుడు తండ్రి కూడా దూరం కావ‌డంతో తేరుకోలేక‌పోతున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈయ‌న మ‌ళ్లీ మామూలు మ‌నిషి అయి అర‌వింద స‌మేత షూటింగ్ కు ఇప్ప‌ట్లో వ‌స్తాడా.. రాడా అనేది అనుమానంగా మారింది. ఇది ఈ సినిమా విడుద‌ల తేదీపై కూడా ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేక‌పోలేదు. సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు ఏ బ్రేక్ లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేసిన త్రివిక్ర‌మ్ కు ఇది షాకే. ఇప్పుడు ఈయ‌న కూడా ఎలా స్పందించాలో అర్థం కావ‌డం లేదు. ప‌రిస్థితులు చూస్తుంటే ఎన్టీఆర్ మ‌రో 10-15 రోజుల వ‌ర‌కు బ‌య‌టికి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇదే కానీ జ‌రిగితే ఖచ్చితంగా అర‌వింద స‌మేత విడుద‌ల తేదీపై ఈ ప్ర‌భావం చూపించ‌క త‌ప్ప‌దు.

కానీ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత షూటింగ్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని ఇప్పటికే త్రివిక్రమ్ కు చెప్పాడు. తాను కూడా అన్ని కార్యక్రమాలు చూసుకుని ఐదు రోజుల్లో షూటింగ్ కు వస్తానని చెప్పినట్లుగా తెలుస్తుంది. తన కోసం షూటింగ్ ఆపడం మంచిది కాదని చెబుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాను షూటింగ్ కు రాకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈయనకు కూడా తెలియంది కాదు. అందుకే బాధ దిగమింగుకుని వస్తున్నాడు. గతంలో రవితేజ కూడా తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే షూటింగ్ కు వచ్చాడు. ఎంతైనా మన హీరోలు నిర్మాతల హీరోలు అని తెలిసిన విషయమే.

More Related Stories