English   

హ‌రికృష్ణ మ‌ర‌ణం.. బాల‌య్య మ‌ళ్లీ క‌లుస్తాడా..? 

Balakrishna-NTR
2018-08-31 04:11:10

ఒక్కోసారి చెడు కూడా మ‌న‌కు మంచే చేస్తోంది అంటారు. నంద‌మూరి కుటుంబం విష‌యంలో ఇది జ‌రుగుతుందిప్పుడు. చావుతో ముడిప‌డిన బంధం అంత ఈజీగా వీడిపోదు అంటారు క‌దా. నంద‌మూరి అన్నాద‌మ్ముల విష‌యంలోనూ ఇది నిజ‌మే అని కాలం నిరూపిస్తుంది. హ‌రికృష్ణ  మ‌ర‌ణం త‌ర్వాత ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆ కుటుంబంతో అంటీముంట‌న‌ట్లే ఉన్న బాల‌య్య‌.. ఇప్పుడు స‌డ‌న్ గా అన్న కుటుంబం త‌న‌దిగా భావిస్తున్నాడు. అన్నీ ఆయ‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ అన్న‌య్య‌ను సాగ‌నంపాడు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కు తోడుగా ఉన్నాడు. ఇన్నాళ్లూ ఈ కుటుంబం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోని బాల‌య్య‌.. ఇప్పుడు మ‌ళ్లీ అన్న‌య్య కుటుంబానికి చేరువ అవుతున్నాడు. ఆయ‌న మ‌ర‌ణ‌మే మ‌ళ్లీ నంద‌మూరి కుటుంబాన్ని ఒక్క‌టి చేసేలా క‌నిపిస్తుంది. చంద్ర‌బాబు కూడా ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కు అండ‌గా నిలిచారు.

అస‌లు గ‌తంలో కూడా నంద‌మూరి కుటుంబంతో ఎక్కువ‌గా క‌లిసేవాడు కాదు ఎన్టీఆర్. కానీ ఆయ‌న స్టార్ అయ్యాక కుటుంబం క‌లుపుకుంది. కానీ ఎక్క‌డ తేడా జ‌రిగిందో తెలియ‌దు గానీ బాల‌య్య అండ్ కంపెనీ ఎన్టీఆర్ ను పూర్తిగా దూరం పెట్టింది. ఎంత‌లా అంటే బాలయ్య చిన్న‌కూతురు పెళ్లికి ఎన్టీఆర్ ను పిల‌వ‌ను కూడా లేదు. అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ తో మాత్రం ఎన్టీఆర్ సాన్నిహిత్యంగానే ఉండేవాడు. కానీ అది ఓ గీత వ‌ర‌కు ఉండేది. అలాంటి టైమ్ లోనే నంద‌మూరి జాన‌కిరామ్ యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు. అప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ అన్న‌య్యే. స‌డ‌న్ గా అన్న‌య్య మ‌ర‌ణం క‌ళ్యాణ్ రామ్ ను కుంగ‌దీసింది. ఇప్పుడు తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ఆ కుటుంబంలో మ‌రింత క‌లుపుగోలుత‌నం వ‌చ్చేసింది. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న బంధాల‌న్నీ ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. 

హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌న‌ను చాలా బాధించింద‌ని.. త‌న‌కు నాన్న త‌ర్వాత నాన్న అంత‌టి వాడు అని బాల‌య్య చెప్ప‌డం నంద‌మూరి అభిమానుల బాధ‌ను కాస్తైనా తీర్చింది. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత బాల‌య్య ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్నాడిప్పుడు. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ తానే అయి చూసుకోవాల‌నుకుంటున్నాడు. పైగా ఎప్పుడూ తోడుగా ఉంటాన‌ని అన్న‌య్య‌కు మాటిచ్చాన‌ని.. అది ఎప్పుడు త‌ప్ప‌నంటున్నాడు బాల‌య్య‌. ఎంతైనా ర‌క్త‌సంబంధం క‌దా.. ఎక్క‌డికి పోతుంది ఆ ప్రేమ‌. అందుకే ఇన్నాళ్లూ బాల‌కృష్ణ.. హ‌రికృష్ణ కుటుంబం అన్న‌ట్లు ఉన్న వీళ్లిద్ద‌రూ ఇప్పుడు నంద‌మూరి కుటుంబం అయిపోతున్నారు. మొత్తానికి జాన‌కిరామ్ క‌న్నుమూసి.. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ను క‌లిపితే.. హ‌రికృష్ణ మ‌ర‌ణం బాల‌కృష్ణ‌ను ద‌గ్గ‌ర చేసింది. చావుతో క‌లిసిన బంధం క‌దా.. చ‌నిపోయేవ‌ర‌కు విడిచిపోయేలా లేదిప్పుడు.

More Related Stories