English   

శైలజా రెడ్డికే కాదు.. కూతురుకీ చాలా ఉంది..?

Shailaja-Reddy-Alludu
2018-08-31 12:59:58

ప్రేమమ్ నుంచి రూట్ మార్చిన చైతూ.. సాఫ్ట్ మూవీస్ తో సత్తా చాటుతున్నాడు. లేటెస్ట్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’గా వస్తున్నాడు. ఇవాళ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న ఈ ట్రైలర్ ఫైనల్ గా వచ్చేసింది. అయితే ఊహించినట్టుగానే ఫుల్ ఆఫ్ ఫన్ అన్నట్టుగా ఉందీ ట్రైలర్. కంప్లీట్ గా మాస్ జానర్ లో సాగే ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అలాగని యాక్షనూ గట్రా పెద్దగా కనిపించడం లేదు కానీ.. మాస్ ఆడియన్స్ విజిల్స్ కొట్టే డైలాగ్స్ సీన్స్ ఉండేలా ఉన్నాయి. అమ్మకు ఈగో.. కూతురుకు డబుల్ ఈగో. ఇలాంటి ఈగో బ్యూటీని ప్రేమించి బుట్టలో పడిపోయాడీ కుర్రాడు.

ఈగోయిస్ట్ లైన తల్లీ కూతుళ్ల మధ్య చిక్కుకున్న ప్రేమికుడుగా నాగ చైతన్య కనిపించబోతున్నాడని అర్థమైంది. అయితే ఆ ఈగో బ్యూటీస్ ను ఎలా డీల్ చేశాడు.. ఎలా సెట్ చేశాడన్నదే ఫన్. అయితే ఈ విషయంలో మారుతి డైరెక్షన్ పై కొంత నమ్మకం ఉంచొచ్చు. ఇలాంటి స్పూత్ కామెడీని బాగా హ్యాండిల్ చేయగలడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ ట్రైలర్ శైలజా రెడ్డి అల్లుడుకు కాస్త భరోసాగానే ఉందనుకోవచ్చు. చైతూ కూడా మాస్ అంటూ మరో జోలికి వెళ్లకుండా కంప్లీట్ గా తనకు కలిసొచ్చిన జానర్ లో సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు.

 ఇక ఫైనల్ గా ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ అనే పాట ట్రాక్ రావడం హైలెట్ అయితే.. ఆ ట్రాక్ వస్తున్నప్పుడే చైతూ ‘డాడీ స్కీమ్ వర్కవుట్ అయినట్టుంది.. మాడమ్ మన ట్రాక్ లోకి వచ్చేసింది’ అనే డైలాగ్ తో చెప్పొచ్చు.. ఇది అత్తా అల్లుళ్ల పోరు అని. అలాగే చాలా రోజుల తర్వాత కమెడియన్ పృథ్వీకి మరో మంచి పాత్ర పడినట్టు తెలుస్తోంది. అతను మాణిక్యం పాత్రలో శైలజా రెడ్డికి, ఆమె కూతురుకు మధ్య నలిగి పోయే పాత్రలా ఉన్నాడు. మొత్తంగా శైలజా రెడ్డి కూతురు చెప్పిన ‘ఆవిడకుండేది ఆవిడకుంటే.. నాకుండేది నాకూ ఉంటుంది’ అనే డైలాగ్  మారుతి మార్క్ ‘డబుల్’ డోస్ లా ఉందనుకోవచ్చు. మొత్తంగా శైలజారెడ్డి అల్లుడు ఈ ట్రైలర్ తో ఫుల్ ఆఫ్ ఫన్ గా మినిమం గ్యారెంటీ అనిపించాడు. 

More Related Stories