English   

ఎన్టీఆర్, బాలయ్యలను కలిపిన హరికృష్ణ..?

Balakrishna-NTR
2018-08-31 19:25:55

కొన్నిసార్లు విషాదం మనుషుల్ని కలుపుతుంది. అప్పటి వరకూ ఉన్న మనస్పర్థలు కూడా తొలగిపోయేలా చేస్తుంది. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఇదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ హరికృష్ణ మరణంతో ఈ ఇద్దరూ కలిసిపోయినట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇకపై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దరికం తీసుకునేందుకు కూడా బాలయ్య సిద్ధపడినట్టు సమాచారం. ఇటు ఈ ఇద్దరికి కూడా పెద్ద లేరు. అందుకే బాలయ్యతో ఉన్న విభేదాలు పక్కన బెట్టి.. అంతా కలిసిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అందుకు వేదికగా ‘ఎన్టీఆర్’ సినిమాను చేసుకోబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

ప్రస్తుతం నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. నిజానికి ఎన్టీఆర్ యంగ్ ఏజ్ పాత్రకు జూనియర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందనుకున్నారు. కానీ అప్పుడు వీరి మధ్య విభేదాలున్నాయి కాబట్టి పట్టించుకోలేదు. కానీ హరికృష్ణ మరణంతో అవి తొలగిపోయినట్టే అంటున్నారు. అటు బాలయ్య కూడా తనకు అన్నపై ఉన్న ప్రేమను బాహాటంగా చెప్పాడు. అలాగే ఆయన తనయుల విషయంలో ఇకపై కఠినంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇక ఎన్టీఆర్ ఈ బయోపిక్ లో నటించే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే వీరు కలిసిపోతే ఖచ్చితంగా బాలయ్య తను అడగకపోయినా క్రిష్ తో అయినా ఎన్టీఆర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని అడిగిస్తాడు. అన్నీ తొలగిపోయాయి కాబట్టి.. ఇటు ఎన్టీఆర్ కూడా నో చెప్పే ఛాన్స్ లేదు. బట్ ఇవన్నీ జరగాలంటే వీళ్లంతా నిజంగానే కలిసిపోయారు అనే మాట నిజం కావాలి. 

More Related Stories