English   

హీరోయిన్ తో విలన్ రియల్ ఫైట్

Sonu-Sood
2018-08-31 20:13:55

తానొకటి తలిస్తే విలనొకటి తలుస్తాడని ఊరికే అనలేదు. ఇప్పటి వరకూ విలన్స్ హీరోలకే ఎదురెళ్లేవారు. కానీ ఈ సారి హీరోయిన్ కూ ఎదురెళ్లాడీ విలన్. అది కూడా రియల్ గానే. అంతే కాదు.. ఆఫ్ట్రాల్ ఓ ఆడదాని దర్శకత్వంలో నటించడమా అని సీరియస్ అవడమే కాదు.. ఏకంగా ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు. అయితే ఇప్పటికే ఈ హీరోయిన్ టార్చర్ కు సినిమా దర్శకుడు కూడా తప్పుకున్నాడు. దీంతో తనే మెగాఫోన్ పట్టి ‘యాక్షన్ కట్’ చెబుతోందీ బ్యూటీ. మరి ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.. ఇంకెవరు మన కాంట్రవర్శీయల్ క్వీన్ కంగనా రనౌత్. యస్.. కంగనా టార్చర్ కు ఇప్పుడు మణికర్ణిక మూవీ టీమ్ నుంచి ఒక్కొక్కరే బయటకు వెళుతున్నారు. ఇప్పటికే మన దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కాకపోతే ఈ విషయం అఫీషియల్ గా చెప్పడం లేదు. ఇప్పుడు ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న సోనూ సూద్ తప్పుకున్నాడు. ఇతను తప్పుకోవడానికి చెప్పిన కారణం.. ఓ మహిళ దర్శకత్వంలో నేను పనిచేయలేను అని. 

నిజానికి కంగనా తనకు చాలా తెలుసు అనేలా బిల్డప్పులు ఇస్తుంది. అదే క్రిష్ కూ నచ్చలేదు. దీంతో 60-70 శాతం షూటింగ్ వరకూ చేసిన అతను ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు. కానీ అతను ఉన్నాడని కంగన చెబుతోంది. బట్ క్రిష్ అనడం లేదు. దీన్ని బట్టే ఈ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయనే విషయం తెలుస్తోంది. ఇక అతను వెళ్లాక అన్నీ తానే అయిన మెగాఫోన్ పట్టుకుంది కంగన. కానీ తనకు చాలా విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో సోనూసూద్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసి బయటకు వచ్చాడు. మరి ఈ మణికర్ణిక ముందుకు సాగుతుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories