English   

సీనియర్ సౌత్ హీరో హీరోయిన్ల పెద్ద మనసు

80's reunion Hero Heroines Given Contribution to Kerala
2018-08-31 23:00:45

మన సౌత్ స్టార్స్ లో కూడా బ్యాచ్ లున్నాయి. అంతా కలిసి ‘రీ యూనియన్’ పేరుతో ప్రతి యేడాది కలుస్తుంటారు. అలా కలిసిన ప్రతి సారీ.. ఓ డిఫరెంట్ డ్రెస్ కోడ్ పాటించడం.. రెండు మూడు రోజుల పాటు రొటీన్ లైఫ్ కు దూరంగా హ్యాపీగా గడిపేస్తుంటారు. ఈ బ్యాచ్ లో తెలుగు, తమిళ, మళయాల, కన్నడ స్టార్స్ ఉన్నారు. అలాగే హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఉంటారు. నిజంగా వీరిది గ్రేట్ బాండ్. అప్పట్లో వీరి రిలేషన్స్ చాలా వరకూ ఓపెన్ హార్ట్ గా ఉండేవని ఇప్పటికీ వీరు కలిసి ఎన్నో వేదికలపై మాట్లాడుతున్నప్పుడు అర్థమౌతుంది. అలాంటి మంచి మనసులున్నాయి కాబట్టే ఆ మనసును చాలా గొప్పగా చాటారిప్పుడు. అవును ఈ 80స్ బ్యాచ్ కేరళ వరద బాధితుల కోసం ఓ గొప్ప సాయం చేశారు.

ఈ 80స్ బ్యాచ్ లో 80మంది సభ్యులున్నారు. వీళ్లంతా కలిసి ఏకంగా 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి కేరళ వరద బాధితులకు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆ గ్రూప్ లోని కీలకమైన ‘‘గాళ్స్’’ సుహాసిని, ఖుష్బూ, లిజి కలిసి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు అందించారు. మొత్తంగా వీళ్లు పర్సనల్ గా ఎంజాయ్ చేయడమే కాదు.. పబ్లిక్ కష్టాల్నీ పంచుకునేందుకు సిద్ధపడటం మెచ్చుకోదగిన విషయమే.

నిజానికి వీళ్లలో చాలామంది ఇప్పటికే వ్యక్తిగతంగా చాలా పెద్ద సహాయాలు చేశారు. అయినా మరోసారి ‘రీ యూనియన్’ బ్యాచ్ తరపున మరోసారి సహాయం చేయడం గొప్ప విషయమే. ఈ స్ఫూర్తిని నేటి తరం హీరోలు కూడా అందిపుచ్చుకోవాలి. అందరూ సుహృద్భావ వాతావరణంలో సినిమాలు చేసుకుంటూ స్నేహంగా ఉంటే వారి అభిమానులు కూడా వారినే ఫాలో అవుతారు. అలాగని వీళ్లంతా ఇప్పుడు విరోధులుగా ఏం లేరు.. కాకపోతే ఆ తరం అంత బాండింగ్ తక్కువగా కనిపిస్తుందనే మాత్రం నిజం.

More Related Stories