English   

సెప్టెంబర్ బరిలో సుమంత్ కూడా

Sumanths-Idam-Jagath
2018-08-31 23:13:52

మళ్లీరావాతో కెరీర్ కు కొత్త టర్న్ తీసుకున్న హీరో సుమంత్. అక్కినేన కాంపౌండ్ నుంచి వచ్చినా ఆస్థాయిలో రాణించలేకపోయిన సుమంత్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీరావా అంటూ వచ్చాడు. ఈ మూవీ డీసెంట్ హిట్ కొట్టడంతో ఇకపై డిఫరెంట్ సినిమాలకే ఓటు అంటూ సెట్ అయ్యాడు. అందుకే మాగ్జిమం కొత్త దర్శకులకే అవకాశాలిస్తున్నాడు. ప్రస్తుతం స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు సుమంత్. వీటిలో మొదటగా వస్తోన్న సినిమా ‘ఇదం జగత్’. ఈ సినిమాలో ఓ మీడియా ఫోటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. వార్తల్ని క్యాష్ చేసుకోవడం తెలిసిన జర్నలిస్ట్ పాత్ర అన్నమాట. కాస్త నెగెటివ్ టచ్ తో సాగే పాత్రలా ఉంది. ఆ మధ్య విడుదలైన టీజర్ తో ఆకట్టుకున్న సుమంత్ ఈ సినిమాతో కాస్త కాంట్రవర్శీ కూడా క్రియేట్ చేసేలా ఉన్నాడు. అవుతుందా లేదా అనేది పక్కన బెడితే ఈ టీజర్ తోనే ప్రామిసింగ్ అనిపించాడు సుమంత్. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి స్పీడ్ పెంచాడు.  ఇదం జగత్ లో సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ శ్రీకంఠం ఈ సినిమాతో దర్శకుడుగా మారుతున్నాడు. గూఢాచారి ఫేమ్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ రోజు నిజానికి చాలా పోటీయే ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయినా సుమంత్ డేర్ చేశాడంటే ఇందులో విషయం ఉన్నట్టే అనుకోవచ్చు. మరోవైపు ఈ సినిమాతో పాటు ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమా కూడా కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మరి ఈ రెండు సినిమాలతో సుమంత్ కెరీర్ ఏ వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.  

More Related Stories