English   

ఇంకో వారం గీత గోవిందం సేఫ్

Nartanasala Paper Boy Movies Cant's Beat Geetha Govindam
2018-09-01 00:07:36

ఏంటో ఈ మధ్య టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయనుకున్నాం. కానీ అవెంతో కాలం నిలవడం లేదు. నిజమే.. సినిమాలైతే వైవిధ్యంగా ఉంటున్నాయి తప్ప.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయి. రెండు వారాల క్రితం వచ్చిన గీత గోవిందం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆ గోవిందంకు చెక్ పెట్టే సత్తా ఉన్న సినిమాయే రాలేదు. ఇక ఈ వారం వచ్చిన నర్తనశాల, పేపర్ బాయ్ లలో ఎవరో ఒకరు హిట్ మంటారనుకుంటే ఇద్దరూ తేలిపోయారు. @నర్తనశాలపై భారీ ఆశలు పెట్టుకున్న నాగచైతన్యకు భారీ షాకే తగిలింది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఛలో తో అందుకున్న హిట్ అతనికి ఆట్టే ఎక్కువ కాలం నిలవలేదు. @నర్తనశాల ‘గే’ కామెడీ నాగశౌర్యకు గట్టి షాకే ఇచ్చింది. అనుకున్నట్టుగానే అన్ని వర్గాల నుంచీ @నర్తనశాలకు ఫ్లాప్ టాక్ వస్తోంది.

ఇక ఈ శుక్రవారం వచ్చిన పేపర్ బాయ్ కూడా కొత్తగా ఏం లేడనే టాక్ వచ్చింది. పాత కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నించినా ఆ పాత వాసనలు మాత్రం పోలేదంటున్నారు. కాకపోతే @నర్తనశాల తో పోల్చుకుంటే ఖచ్చితంగా పేపర్ బాయ్ బెటర్ అంటున్నారు. కాకపోతే మరీ పొయొటిక్ గా సాగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. బట్ పాటలు, సినిమాటోగ్రఫీ బావుందనే టాక్ వచ్చింది. అలాగే హీరో సంతోష్ శోభన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. కొన్నిసార్లు పేపర్ పాతదే అయినా అందులోని వార్తలూ ఆకట్టుకుంటాయి కదా.. అలాగే ఈ పేపర్ బాయ్ కూడా ఆకట్టుకునే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఈ వారం కూడా ఈ సినిమా హిట్ అని ఖచ్చితంగా చెప్పలేకపోవడం మాత్రం మరోసారి నిరాశ కలిగించే అంశంగానే చెప్పాలి.

More Related Stories