English   

క‌ల‌ర్స్ స్వాతి పెళ్లైపోయింది

Actress Colors Swathi Marriage
2018-09-01 00:53:37

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ పెళ్లి మూడ్ లో లేదు.. ఇప్పుడు అంతా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఓ వైపు హ‌రికృష్ణ మ‌ర‌ణంతో పాటు మ‌రో  వైపు బి జ‌య మ‌ర‌ణం కూడా మ‌నోళ్ల‌ని వెంటాడుతున్నాయి. అయితే ఈ మూడ్ ను కాస్తైనా మార్చేసింది క‌ల‌ర్స్ స్వాతి. ఈ భామ ఇప్పుడు పెళ్లి చేసుకుంది. 15 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉండి.. యాంక‌ర్ గా.. న‌టిగా.. హీరోయిన్ గా అన్ని ర‌కాల పాత్ర‌ల్లోనూ క‌నిపించిన స్వాతి ఇప్పుడు పెళ్లికూతురు అయింది. స్వాతి అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం కానీ క‌ల‌ర్స్ స్వాతి అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు జ‌నాలు. అప్ప‌ట్లో మాటీవీలో వ‌చ్చిన ప్రోగ్రామ్ తో ఇంత‌గా ఫేమ‌స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. కొన్నేళ్లుగా తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా సినిమాలు చేసి అన్ని చోట్లా మంచి పేరు తెచ్చుకున్న స్వాతి.. ఇప్పుడు కోరుకున్న వాడితో ఏడ‌డుగులు న‌డిచింది. ఆగ‌స్ట్ 30న త‌ను ప్రేమించిన కేర‌ళ కుర్రాడు వికాస్ ను పెళ్లి చేసుకుంది స్వాతి. హైదరాబాద్ లోనే ఎన్ డైమండ్ ఎన్ క‌న్వెన్ష‌న్ లో వీళ్ల పెళ్లి జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 2న రిసెప్ష‌న్ మాత్రం పెళ్ళికొడుకు ఊళ్లో అంటే కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌ర‌గ‌బోతుంది. సేవ్ ది డేట్స్ అంటూ కొత్త‌గా పోస్ట‌ర్ కూడా అప్ప‌ట్లో విడుద‌ల చేసింది ఈ భామ‌. తెలుగ‌మ్మాయి కాస్తా ఇప్పుడు కేర‌ళ కోడ‌లు అయిపోయింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగానే ఉండ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక‌పై స్వాతిని చూడాలంటే పాత సినిమాల్లో చూడ‌ట‌మే..!

More Related Stories