English   

తాత తండ్రి దారిలో నంద‌మూరి బ్ర‌ద‌ర్స్

NTR Kalyan Ram Following Sr NTR Harikrishna Footsteps
2018-09-01 03:16:29

మ‌నం పెద్ద‌వాళ్ల నుంచి ఏం నేర్చుకున్నా నేర్చుకోక‌పోయినా వాళ్లు నేర్పించిన మంచి గుణాలు తీసుకుంటే చాలు. ఇప్పుడు నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రూ తండ్రి, తాత చూపించిన దారిలోనే న‌డుస్తున్నారు. తండ్రి పోయిన బాధ‌లో డీప్ షాక్ లోకి వెళ్లిపోయారు నంద‌మూరి సోద‌రులు. ఇలాంటి టైమ్ లో బాల‌య్యే వాళ్ల‌కు తోడుగా ఉన్నాడు. అభిమానుల అండ‌దండ‌లు కూడా ఉన్నాయి. నాన్న పోయిన బాధ‌లో ఇలాగే ఉంటే ఇంకా వేదన ఎక్కువ‌వుతుందే కానీ త‌గ్గ‌దు. అందుకే పెద్ద‌క‌ర్మ కూడా కాకుండానే ఎన్టీఆర్ తో పాటు క‌ళ్యాణ్ రామ్ కూడా షూటింగ్ కు వ‌చ్చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి అర‌వింద స‌మేత‌లో పాల్గొన‌బోతున్నాడు జూనియ‌ర్. అదే విధంగా క‌ళ్యాణ్ రామ్ కూడా గుహ‌న్ సినిమా కోసం మొహానికి మేక‌ప్ వేసుకోనున్నాడు.

ఇది అప్ప‌ట్లో ఎన్టీఆర్ తో పాటు హ‌రికృష్ణ కూడా చేసిన ప‌ని. వాళ్లు కూడా సెల‌వులు.. పండ‌గ‌లు ప‌బ్బాలు అంటూ ఇంట్లో కూర్చునే వాళ్లు కాదు. ఏదేమైనా త‌మ‌ను న‌మ్మిన నిర్మాత‌ల కోసం ప‌గ‌లు రేయి చూడ‌కుండా క‌ష్ట‌ప‌డే వాళ్లు. ఇప్పుడు అదే వంశంలో వాళ్ల‌కు వార‌సులుగా పుట్టిన నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ మాత్రం పేరు నిల‌బెట్ట‌కుండా ఉంటారా..? త‌మ‌పై కోట్లు పెట్టిన నిర్మాత‌ల కోసం కొండంత దుఖాన్ని కూడా దిగ‌మింగి షూటింగ్ కు వ‌స్తున్నారు ఈ ఇద్ద‌రూ. వీళ్ల‌కు క‌న్నీటితో స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా వేచి చూస్తున్నారు. అర‌వింద స‌మేత ఎప్ప‌ట్లాగే మ‌ళ్లీ నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ కూడా త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హ‌రికృష్ణ పాత్ర కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. సెప్టెంబ‌ర్ రెండో వారంలో మొద‌ల‌య్యే ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 26 రోజుల డేట్స్ ఇచ్చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. మొత్తానికి తాత తండ్రి పేరు నిల‌బెడుతూ దూసుకెళ్లిపోతున్నారు ఈ సోదరులిద్ద‌రూ.

More Related Stories