English   

ముద్దుల‌తో సినిమాలు న‌డుస్తాయా..?

Will Work Bold Content Like Arjun Reddy RX 100 Bhairava Geetha
2018-09-01 11:49:12

ఒక‌ప్పుడు తెలుగు సినిమాల్లో ఒక్క ముద్దు సీన్ ఉంటేనే వామ్మో అనుకునేవాళ్లు. అదేదో బూతు.. పాపంలా చూసేవాళ్లు. బాలీవుడ్ లో మాత్ర‌మే ఉన్న ఈ ముద్దుల ట్రెండ్ తెలుగుకు పాక‌డానికి చాలా ఏళ్లు ప‌ట్టింది. ఇక్క‌డ బ‌న్నీ, మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా ముద్దు సీన్స్ లో న‌టించినా కూడా మ‌న హీరోలు మాత్రం అంత ధైర్యం చేయ‌లేక‌పోయారు. కానీ చిన్న సినిమాలు మాత్రం ముద్దుల విష‌యంలో హ‌ద్దులు పెట్టుకోవ‌డం లేదు. ప్ర‌తీ సినిమాలో క‌నీసం అర‌డ‌జ‌న్ ముద్దులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవ‌లం ముద్దులు ఉంటే సినిమాలు న‌డుస్తాయా అంటే ఏమో గుర్రం ఎగరావ‌చ్చు.. సినిమా న‌డ‌వావ‌చ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమా అంటే బూతు సినిమా అనే స్థాయికి దిగ‌జార్చేసారు కొంద‌రు ద‌ర్శ‌కులు. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 అయితే క‌థ కంటే ఎక్కువ‌గా కాంట్ర‌వ‌ర్సీతోనే హిట్ అయింది. అందులో పాయ‌ల్ రాజ్ పుత్ అయితే ముద్దుల్లో ముంచేసింది హీరో కార్తికేయ‌ను.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ కూడా అంతా ఈ ముద్దుల‌తోనే చేసుకున్నారు. దానికి ముందు అర్జున్ రెడ్డిలో కూడా లిప్ లాక్ సీన్స్ కు కొద‌వేలేదు. అయితే ఆ సినిమాలో ముద్దు సీన్లు ఎబ్బెట్టుగా మాత్రం ఉండ‌వు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 ఇచ్చిన ధైర్య‌మో ఏమో కానీ భైర‌వ‌గీత అనే సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇది వ‌ర్మ స్కూల్ నుంచి వ‌స్తున్న సినిమానే. సిద్ధార్థ్ తాతోలు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. వ‌ర్మ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. ర‌థం అనే మ‌రో సినిమాలో కూడా ముద్దులే హైలైట్ అవుతున్నాయి. ట్రైల‌ర్లో నిండా ముద్దులే చూపించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికిప్పుడు టాలీవుడ్ కూడా ముద్దుల విష‌యంలో బాలీవుడ్ తో పోటీ ప‌డుతుంది. మ‌రి కేవ‌లం ఈ ముద్దులే ఉంటే సినిమాలు ఆడ‌తాయా..? అది ద‌ర్శ‌కులే ఒక్క‌సారి త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకోవాలి.

More Related Stories